రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇరువురే ముఖాముఖీ కూర్చుని తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో వైసీపీ దుర్మార్గపు ప్రచారం చేయడమే కాకుండా కుల చిచ్చు రేపడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం (ఫిబ్రవరి 4)జరిగిన ఈ భేటీలో అటు లడ్డూ కల్తీ నివేదికపై తదుపరి యాక్షన్, ఇటు రాజ్యసభ సీట్ల కేటాయింపు.. రాష్ట్రంలో పాలన తదితర అంశాలపై కూడా ఈ భేటీలో వీరు చర్చించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనీ, క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ ఎత్తుగడలకు క్యాడర్ సమన్వయంతో చెక్ పెట్టేలా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలని వారికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదిక పై కూడా వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, కేవలం రసాయనాలు, పామాయిల్ కలిపి దీనిని సృష్టించారని సిట్ నివేదిక నిర్ధారించిన నేపథ్యంలో ఈ కల్తీ వ్యవహారంలో సూత్రధారులను వదిలిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్య తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా లెతుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-cbn-and-deputy-cm-pk-meet-39-213520.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.