లోకేష్ విషయంలో వెనక్కు తగ్గిన సీఐడీ.. జగన్ కు పిక్చర్ క్లియర్!

Publish Date:Oct 6, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయిన వారానికే ఆయన కుమారుడు, పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన చేసిన తెలిసిందే. వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ స్థాయి నేతలను కలిసి రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన గురించి వివరించారు. స్వతహాగా చంద్రబాబు తత్వం, ఆయన పరిపాలన, రాజకీయ సిద్ధాంతాల గురించి తెలిసిన జాతీయ స్థాయి నేతలంతా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మరో వైపు లోకేష్ జాతీయ మీడియా సంస్థల   లైవ్ డిబేట్లలో పాల్గొని వైసీపీ అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఏపీ వైపు మళ్లింది. ఇదే సమయంలో వైసీపీ ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు  సిద్ధమైంది. ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు చేశారు. 

అప్పటికే రాష్ట్రంలో మధ్యలో బ్రేకులు పడిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రకటించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. పలు దఫాలుగా సమాలోచనలు చేసిన అనంతరం చంద్రబాబు కేసు కొట్టివేత లేదా బెయిల్ దక్కే వరకూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించకుండా నేతలు, టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు క్యాష్ పిటిషన్, బెయిల్ అంశాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ మరికొన్ని రోజులు లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ లోకేష్ ను అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో కూడా లోకేష్ ని ఇరికించిన సీఐడీ.. ఆ కేసులో అయినా లోకేష్ ను అరెస్ట్ చేయాలని చూసారు. కానీ, ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది.

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు, లోకేష్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలను కూడా అరెస్టు చేసి నాయకత్వం లేకుండా చేయాలని భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కేసులు పెడతామని వైసీపీ నేతలు బహిరంగంగానే బెదిరించారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కూడా అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే, లోకేష్ కానీ, పవన్ కానీ దేనికైనా సిద్ధమని ప్రకటించారు. నిజానికి లోకేష్ అరెస్టు అనే ప్రచారం జరిగే నాటికి లోకేష్‌పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా చేర్చారు. స్కిల్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా లోకేష్ పేరు ఉందని సీఐడీ అధికారులు చేస్తున్న ప్రచారంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండడంతో జరుగుతున్న డ్యామేజ్ తో తనను ఎలాగైనా ఏపీకి రప్పించాలని లోకేష్ ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైసీపీ ముమ్మర ప్రచారం చేసింది. 

కాగా, ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ బండారం బయటపడింది. ఏ14గా లోకేష్ ను చేర్చినా.. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్లు మారిపోయిందని, అందుకే 41A నోటీసులు ఇస్తే అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో కూడా తనకు స్పష్టత లేదన్న ఏజీ.. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్‌లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు. ఇలా లోకేష్ విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేనివేనని తేలిపోయింది. ఇలాంటి కేసులతో లోకేష్ ను అరెస్ట్ చేసినా రేపు ఇబ్బందులు తప్పవనే సీఐడీ వెనక్కు తగ్గినట్లు కనిపించింది.

ఇప్పటికే చంద్రబాబు కేసును ఎలాగైనా నిరూపించాలని నానాయాతన పడుతున్నారు. అలాగే జరిగిన నష్టంపై కూడా వైసీపీ పెద్దలు సమాలోచన చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఆదేశిస్తే  చాలు తాము ఎవరినైనా అరెస్టు చేస్తాం, ఏ కేసైనా పెడతాం అన్నట్లు వ్యవహరించిన ఏపీసీఐడీ అడ్డగోలుగా, ఇష్టారీతిన కేసులు నమోదు చేసి న్యాయస్ధానాల ముందు నిలవలేమని గుర్తించి వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. అలాగే అధికారం చేతిలో ఉన్నంత మాత్రానా ఇష్టారీతిగా వ్యవహరిస్తే బొక్కబోర్లా పడకతప్పదన్న క్లారిటీ జగన్ కు వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.