Publish Date:Feb 11, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా కాలేదు... కానీ, అప్పుడే, ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నీలం సహానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నవంబర్ 17న బాధ్యతలు స్వీకరించిన నీలం సహానీ... జగన్ ప్రభుత్వ తీరుతో అడ్జస్ట్ కాలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. అందుకే, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అయిన నీలం సహానీకి 2020 జూన్ 30వరకు పదవీ కాలముంది. నీల సహానీ, ఏపీ సీఎస్ గా రాకముందు సెంట్రల్ సర్వీసుల్లో ఉంటూ... కేంద్ర సామాజిక న్యాయశాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అయితే, అప్పటివరకు ఏపీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని అనూహ్యంగా అవమానకరరీతిలో సాగనంపిన జగన్ ప్రభుత్వం.... నీలం సహానీని కేంద్ర సర్వీసుల నుంచి ప్రత్యేకంగా పిలిపించిమరీ సీఎస్ గా అవకాశమిచ్చింది.
అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో నీలం సహానీ అడ్జస్ట్ కాలేకపోతున్నారని, ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీరు, తీసుకుంటోన్న నిర్ణయాలతో నీలం సహానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మూడు రాజధానుల కేసుల్లో కార్యాలయాలను తరలించొద్దని హైకోర్టు ఆదేశించినా, న్యాయస్థానం ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రభుత్వం జీవోలు జారీ చేయడం లాంటివి... సీఎస్ నీలం సహానీని చిక్కుల్లోకి నెట్టేశాయని చెబుతున్నారు. ఒకవైపు కోర్టుల ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి.... మరోవైపు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన ఒత్తిడి... ఇలా, న్యాయస్థానాలు... ప్రభుత్వం మధ్య నలిగిపోతున్న నీలం సహానీ.... ప్రెజర్ తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
అప్పుడు ఎల్వీ సుబ్రమణ్యం అయినా... ఇప్పుడు నీలం సహానీ అయినా... జగన్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. పేరుకే ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీ పెద్దయినా... మొత్తం సీఎంవో చెప్పినట్లే నడుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా సీఎంవోలోని ఒక అధికారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందంటున్నారు. అతని కారణంగానే, ఎల్వీ సుబ్రమణ్యాన్ని సాగనంపగా... ఇప్పుడు నీలం సహానీది దాదాపు అదే పరిస్థితి అంటున్నారు. జూనియరైన ఆ అధికారి చెప్పినట్లే మొత్తం నడుస్తోందని, అందుకే... దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-chief-secretary-neelam-sahney-is-applied-for-long-leave-25-94093.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.