ఏపీ సీఈవోకు సీఈసీ పిలుపు.. కారణమేంటో?

Publish Date:Jul 12, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. ఆయనను హస్తిన రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆఘమేఘాల మీద ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఢిల్లీ  వెళ్లడంతో ఇప్పుడు రాజకీయవర్గాలలో ముఖేష్ కుమార్ మీనా హస్తిన పర్యటనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ముందుగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన సన్నాహకాలలో బిజీగా ఉంది. అయినా అంతటి పని ఒత్తిడిలోనూ ఏపీ సీఈవో ( ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి)ని హస్తినకు పిలిపించుకుంది. దీంతో  రాజకీయవర్గాలలో ఆయన హస్తిన పర్యటనపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఓట్ల గల్లంతుపై వివరణ కోరేందుకు ఆయనను సీఈసీ హస్తినకు పిలిపించుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు ఆరోపణలపై ఎక్స్ ప్లనేషన్ కోరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  ఎందుకంటే ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదుపై ఏపీ లో ప్రధాన ప్రతిపక్షం   తెలుగుదేశం ఆధారాలతో  ఎన్నికల సంఘానికి  పలు ఫిర్యాదులు చేసింది.  తెలుగుదేశం ఫర్యాదులో చూపిన ఆధారాలతో  ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదు అసాధారణ స్థాయిలో ఉండటంతో  కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించిందనీ, ఇందులో భాగంగానే ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిపించుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 మరో వైపు ఇటీవల జగన్ హస్తిన పర్యటనలో భాగంగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి చేసిన విజ్ణప్తి మేరకు.. అందుకు గల అవకాశాలపై చర్చించేందుకు సీఈసీ ముఖేష్ కుమార్ మీనాను హస్తినకు పిలిచి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. ఏపీ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై పూర్తి వివరాలతో ఎస్ఈవో ఢిల్లీకి వెళ్లారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్రచారానికి బలం చేకూర్చే విధంగానే అధికారవర్గాల కథనం ఉంది.

ఏపీలో ముందస్తు ఎన్నికల విషయంపై సీఎం జగన్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలతో మాట్లాడారనీ, అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారనీ అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముకేష్ కుమార్ మీనా హస్తిన పర్యటన నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట మళ్లీ జోరుగా మొదలైంది.  ఏపీలో ముందస్తుకు ఈసీ  సన్నాహకాల నేపథ్యంలోనే ఏపీ సీఈఓను హస్తినకు పిలిపించుకుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో షెడ్యూల్ రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  డిసెంబర్ లో పోలింగ్ జరుగుతుంది. ఇందు కోసం ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేసింది. ఏపీలోనూ ఈ సన్నాహకాలు జరుగుతున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే బుధవారం (జూలై 12) సీఎం జగన్ కేబినెట్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఏపీలో ముందస్తు సన్నాహకాల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.