మంత్రివర్గమా భజన బృందమా ? ఏపీ కాబినెట్ తీరుపై జనం సందేహం
Publish Date:May 30, 2022
Advertisement
ఆమె ఒక మహిళా మంత్రి... అయినా రేపులంటే లెక్క చేయరు. ఒకటి రెండు రేపులకే అలా గగ్గోలు పెట్టేస్తారేంటి ? అవును రాష్ట్రంలో రేపులు జరిగాయి .. సో ...వాట్ అన్న రీతిలో, అదేదో రొటీన్ వ్యవహారం అన్నంత తేలిగ్గా తీసేస్తారు. సరే, ఆవిడంటే మొదటి సారి మంత్రి అయ్యారు. కొంచెం చాలా బోల్డ్’ లేడీ, జబర్దస్త్ నవ్వులకు అలవాడు పడిన మహిళా మూర్తి... సో... ఆమె నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా వ్యర్ధమే అనుకోండి అది వేరే విషయం. నిజానికి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గ పక్షాళన తర్వాత కొద్ది మంది సీనియర్లకు అవకాశం ఇచ్చారు. అందులో ధర్మాన ఒకరు. ధర్మాన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలో సుదీర్ఘ కాలం పాటు, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలక పదవులు అనుభవించారు. అంతే కాదు, చాల విషయాల్లో చక్కని అవగాహన, అనుభవం ఉన్న మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.అయితే చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా, ధర్మాన ప్రసాద్ రావు కూడా, జూనియర్లకు తీసుపోకుండా, వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన నోరు తెరిస్తే వివాదం అవుతోంది. తాజాగా మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా అనంతపూర్’లో ప్రసంగించిన సీనియర్ అమాత్యులు ధర్మాన ప్రసాద్ రావు, ప్రజల ఖాతాలలో పైసలు పడిపోతుంటే, ఇంకా అభివృద్ధి ఎందుకు? అంటూ అభివృద్ధికి, కొత్త అర్థం, కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రతిపక్షాలు, అభివృద్ధి జరగడం లేదని, గగ్గోలుపెడతారేంటని, చికాకు పడిపోయారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా అని ఆయన ఫైర్ అయ్యారు. అది కూడా, మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత వివాదంగా మారింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వం ముందు చేయి చాపాలే కానీ అభివృద్ధి మాట ఎత్తకూడదు అన్నట్లుగా అయన మాటలు ఉన్నాయని విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు మండి పడుతున్నారు. పేదలు ఎప్పటికీ, పేదరికంలోనే మగ్గి పోవాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ఇది ధర్మాన బుర్రలో పుట్టిన అలోచన కాదు, ముఖ్యమంత్రి జగ్బంమోహన్ రెడ్డి, ‘రాజకీయ సిద్ధాంతమే’ అది. గత మూడేళ్ళుగా ఆయన అదే చేస్తున్నారు. అభివృద్ధి అనే మాటే వినిపించకుండా, మీట నొక్కి ఓటర్ల ఖాతాలో పైసలు వేసి, ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునే, నయా రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాని, అమలు చేస్తున్నారు. పేదరికం, పేదలు ఉంటేనే తమ రాజకీయ పబ్బం గడుస్తుందనే ఆలోచనా మార్గంలోనే అయన ముందుకు సాగుతున్నారు. పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు. అసలు పరిపాలన అంటే అదే అన్న విధంగా జగన్ రెడ్డి నడక సాగుతోంది. అయితే కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తే అప్పుల తప్పవని, తెలుసుకో లేక పోయారు. అందుకే, రాష్ట్రం మూడేళ్ళలోనే దివాళా దశకు చేరుకుంది. నిజానికి ధర్మాన వంటి సీనియర్ మంత్రులు, అనుభవ రాహిత్యంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంతి జగన్ రెడ్డికి, మంచి చెడును విడమరిచి చెప్పే ప్రయత్నం చేయాలని, చేస్తారని అనుకుంటాము. కానీ, అధికార పార్టీలో ఉండి కూడా మూడేళ్ళ పాటు మంత్రిపదవికి దూరంగా ఉండడం వల్లనో ఏమో, అంత సీనియర్ మంత్రి కూడా జీహుజూర్’ అనే స్థితికి చేరుకున్నారు. అందుకే, కావచ్చు గతంలోనూ జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదన్నారు. ఒక రోజా, ఒక ధర్మాన మాత్రమే కాదు జగన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రులు అందరూ కూడా ఒకే తానూ పీసులు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. అందుకే మంత్రులు, మంత్రుల్లా కాకుండా ముఖ్యమంత్రి భజన బృందంలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్’లో జగన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని ఒకరంటే, పొరుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలను ఆంధ్ర ప్రదేశ్’లో కలిపేయాలని దేంద్న్ చేస్తున్నారని జగన్ భజన చేస్తున్నారు. అందుకే ఏపీ కాబినెట్ .. అంటే బాజా భజంత్రీలు అని జనం నవ్వుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-cabinet-ministers-are-like-bhajana-group-39-136684.html





