Publish Date:May 20, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
మరోవైపు రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పంటల దిగుబడులపై సీఎంకు అధికారులకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. లిక్కర్ స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.
▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం.
▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం.
▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి.
▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ.
▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం.
▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం.
▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cabinet-meeting-39-198355.html
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.