మద్యానికి హద్దులు లేవు.. తెలంగాణ షాపులకు ఏపీ వ్యాపారుల పోటాపోటీ
Publish Date:Nov 18, 2021
Advertisement
తెలంగాణాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం, పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా వ్యాపారులు పోటీ పడుతున్నారు. ముఖ్యమంగా సరహద్దు జిల్లాలలో ఏపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దశలవారీగా మద్యపానం నిషేధం పేరుతో విపరీతంగా పెంచుతోంది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యపారం చేస్తోంది. అదే విధంగా, ఏపీలో స్టాండర్డ్ బ్రాండ్స్ మద్యం దొరకదు. రాష్టంలో తయారయ్యే ప్రత్యేక బ్రాండ్స్ మధ్య్యాన్ని మాత్రమే ప్రభుత్వ మధ్య దుకాణాల్లో విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి, అలవాటైన బ్రాండ్స్ తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో, ఏపీ మధ్య ప్రియులు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరహద్దులలోని షాపులు, బార్లలో మద్యం సేవించేందుకు వచ్చి పోతుంటారు. ఈ రకంగా ఆంద్ర సరిహద్దుల లోని తెలంగాణ ప్రాంతంలోని మద్యం దుకాణాలలో వ్యాపారం మూడు ఫుల్ ఆరు హల్ఫ్’లు అన్నట్లుగా సాగుతోంది. అందుకే,ఏపీ సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతంలోని మధ్య షాపులకు పోటీ ఎక్కువగా ఉందని, సంబధిత అధికారుల సమాచారం. ఉదాహరణకు ఏపీలోని కర్నూలుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ చౌరస్తాలోని రెండు మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సైతం పోటీపడుతున్నారు. ఈ రెండు దుకాణాలకు ఒక్కొక్క దుకాణానికి రోజుకు రూ. 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే మద్యం ప్రియుల తాకిడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మద్యం టెండర్ల కోసం భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. మద్యం లైసెన్సు దరఖాస్తుకు ఈరోజే చివరి రోజు కావడంతో, ఈ ఒక్కరోజే 500 మంది లైసెన్సులు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇలా దరఖాస్తు చేసుకున్న వరిలో 350 మంది కేవలం ఈ రెండు దుకాణాల కోసమే వేశారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో ఏపీనుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లైసెన్సుల కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సైతం టెండర్లలో పాల్గొని... మద్యం దుకాణాలను దక్కించుకునే అవకాశం ఇచ్చిందని సైదులు పేర్కొన్నారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
http://www.teluguone.com/news/content/ap-business-men-tenders-to-ts-wine-shops-39-126651.html





