రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

Publish Date:Mar 18, 2013

Advertisement

 

 

 

శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి రూ.1,61,348 కోట్లతో సోమవారం ఉదయం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రాసనం వేస్తుందన్నారు. వ్యవసాయం రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. ఉగాది నుంచి పేదలకు రేషన్ కార్డు ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, దాని కోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

బడ్జెట్‌లోని అంశాలు :
- హోంశాఖ - రూ.5,386 కోట్లు
- ఐటీ - రూ.207 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం - రూ.1,120 కోట్లు
- సాగునీరు - రూ.13,800 కోట్లు
- ఇంధనం - రూ.7,117 కోట్లు
- మౌలిక సదుపాయాల కల్పనకు - రూ. 180 కోట్లు
- పర్యావరణం, అడవులు, శాస్త్రసాంకేతిక రంగానికి - రూ.551 కోట్లు
- పాఠశాల విద్య - రూ.16990 కోట్లు
- ఉన్నత విద్య - రూ.4082 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖ - రూ.1,738 కోట్లు
- కార్మిక శాఖ - రూ.562 కోట్లు
- పట్టణాభివృది - రూ.6770 కోట్లు
- ఎన్ఆర్ఈజీఎస్ - రూ.11200 కోట్లు
- పౌరసరఫరా - రూ.3231 కోట్లు
- గృహనిర్మాణం - రూ. 2326 కోట్లు
- సాంస్కృతిక రంగం - రూ.69 కోట్లు
- పర్యాటక రంగం - రూ. 163 కోట్లు
- యువజన సేవలకు - రూ.280 కోట్లు
- వికలాంగులకు - రూ.73 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి - రూ.1027 కోట్లు
- బీసీ సంక్షేమానికి - రూ.4027 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి - రూ.4,122 కోట్లు
- గిరిజన సంక్షేమానికి - రూ.2,126 కోట్లు
- వ్యవసాయానికి - రూ.6,28 కోట్లు
- మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,980 కోట్లు
- కృష్ణా జలాల తరలింపునకు రూ.1,676 కోట్లు
- కొత్తగా 18 రెవెన్యూన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు
- 2 కలెక్టరేట్‌లు, 144 తహశీల్దార్ భవనాలు నిర్మిస్తాం
- రెవెన్యూ అధికారుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు
- ఈ ఏడాది 27,903 కొత్త ఉద్యోగాలు
- తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి 100 పడకల పెంపు
- నెల్లూరులో 150 పడకలతో ఆస్పత్రి
- వికలాంగులకు వివాహం చేసుకుంటు 50 వేలతో ప్రోత్సాహం
- 2291 సబ్ఇన్‌స్పెక్టర్లు, 736 కానిస్టేబుళ్ల నియామానికి త్వరలో నోటిఫికేషన్
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ల నిర్మాణం
- వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.262 కోట్లు
- తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్
- రాజీవ్ యువ కిరణాలు ద్వారా 2014-15 నాటికి 15 లక్షల మందికి ఉపాధి
- గ్రామీణ, నగర ప్రాంతాల్లో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం.

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.