ఏపీ బీజేపీ నక్క జిత్తులు ప్రారంభం!

Publish Date:May 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో దోస్తీ చేయడం, బీజేపీని కూటమిలో భాగస్వామిని చేయడం టీడీపీ వర్గాలకు మొదట్లో ఉత్సాహం కలిగించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే బీజేపీతో చేతులు కలపడం మెడకు రోలు తగిలించుకున్నట్టే అయిందని అర్థమైంది. బీజేపీ వల్ల నష్టమే తప్ప లాభం వుండదనే పాయింట్‌లో టీడీపీ, జనసేన వర్గాలకు క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ స్నేహ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులు గెలవటం కోసం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తమ శాయశక్తులా కృషి చేశారు. బీజేపీని తమ భుజాల మీద మోసుకెళ్ళడానికి శ్రమించారు. అయితే బీజేపీ లీడర్లు, కేడర్ మాత్రం తమ పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల మీద మాత్రమే తమ దృష్టిని నిలిపారు. టీడీపీ, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల జెండాలతోపాటు బీజేపీ జెండా కూడా రెపరెపలాడిందే తప్ప బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించింది సున్నా. సహకరించకపోగా, ఒకపక్క ప్రచారం జరుగుతున్న సమయంలోనే బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు టీడీపీ, జనసేన స్నేహధర్మం పాటించడం లేదని, తమకు సహకరించలేదని ఆరోపణ చేశారు. వైసీపీ దృష్టిలో కూటమి చులకనైపోయేలా చేశారు.

బీజేపీది మొదటి నుంచి ఒకటే సీక్రెట్ ఎజెండా. టీడీపీ, జనసేనతో కూటమి కట్టాలి. ఎలక్షన్లలో కూటమి విజయం సాధిస్తే మావల్లే విజయం సాధించిందని బిల్డప్పు ఇచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం నెత్తిన కూర్చుని వేధించి సాధించాలి. చంద్రబాబును అడుగు ముందుకు వేయకుండా చేసేలా కాళ్ళకు అడ్డుపడాలి. తద్వారా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో రెండో స్థానానికి చేరుకోవాలి. 2014లో బీజేపీ ఈ వ్యూహాన్నే పాటించింది. కాకపోతే చంద్రబాబును దెబ్బతీయ గలిగిందిగానీ, తాను రెండో స్థానంలోకి రాలేకపోయింది. 2024 ఎన్నికలలో కూడా బీజేపీ ఇదే వ్యూహంతో కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో కూటమి గెలవాలని అందరూ కోరుకుంటున్నారు గానీ, బీజేపీ మాత్రం నిన్నమొన్నటి వరకు  ‘నాకు ఎవరు గెలిచినా ఒకటే’ అన్నట్టుగా వుంది. కూటమి తెలిస్తే, అధికారంలో భాగస్వామ్యం... వైసీపీ గెలిస్తే ఆ పార్టీతో స్నేహం కొనసాగింపు అన్నట్టే అన్నట్టుగా, గోడమీద పిల్లిలాగా వుంది. 

ఈసారి ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమేనని గత కొద్ది రోజులుగా అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారని అనధికారికంగా వెల్లడవుతున్న సర్వేలన్నీ చెబుతున్నాయి. నేషనల్ మీడియా కూడా ఏపీలో ప్రభుత్వం మారబోతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాబోతోంది కదా అని ఆనందించాల్సిన బీజేపీ ఆ పని చేయకుండా గుంటనక్క జిత్తులు ప్రదర్శించడం ప్రారంభించింది.

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇక వైసీపీ ఖేల్ ఖతం అయిపోతుంది. ఐదేళ్ళుగా బెయిల్ మీద వున్న జగన్ జైలుకు వెళ్ళక తప్పదు. అప్పుడు వైసీపీ నాయకుడు లేనీ పార్టీ అయిపోతుంది. ఆ పార్టీలో వున్న నాయకులకు ఇప్పటికే దడ ప్రారంభమైంది. చంద్రబాబు పవర్లోకి వచ్చాక వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కాకుండా వుంది. మారుమనసు పొందిన వాళ్ళలాగా యాక్టింగ్ చేసి టీడీపీలో చేరే అవకాశం కూడా లేదు. అలాంటి వాళ్ళని ఆకర్షించే పనిలో ఇప్పుడు ఏపీ బీజేపీ వుంది. తన ప్రయత్నాలను వల్లభనేని వంశీతో ప్రారంభించింది. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన నాయకులు చాలామంది వున్నారు. వాళ్ళందర్నీ చేర్చుకునే ప్లాన్‌లో బీజేపీ నాయకులు వున్నారు. జూన్ 4 తర్వాత ఎఫ్పుడైతే వైసీపీ ఓడిపోతుందో వెంటనే కార్యాచరణలోకి దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వైసీపీ నాయకులను చేర్చుకోవడం ద్వారా, రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయం స్థాయికి ఎదగాలన్నది ఏపీ బీజేపీ గుంటనక్క ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేయడం తప్పేమీ కాదు.. కాకపోతే, తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహం కొనసాగిస్తూనే ఇలాంటి ప్లాన్లు వేయడం మాత్రం బీజేపీ లాంటి పార్టీకే చేతనైన విద్య.

By
en-us Political News

  
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.