బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్.. మరి ఏపీలో?

Publish Date:Nov 8, 2015

Advertisement



బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఆ పార్టీ మతతత్వ పార్టీ అనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తూనే వుంటాయి. ఆ విమర్శల తీవ్రత చూస్తుంటే బీజేపీ మీద వున్న మతతత్వ పార్టీ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదేమో అనిపిస్తూ వుంటుంది. ఇంతకాలం ‘మతతత్వ’ ముద్ర వున్న బీజేపీ మీద ఇప్పుడు కులతత్వ ముద్ర కూడా పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో విజయం సాధించడం కోసం బీజేపీ కులాన్ని పావులా వాడుకుంది. జితన్ రామ్ మాంఝీ, ఇలాంటి ‘క్యాస్ట్ కార్డు’ వున్న మరికొందరు నాయకులను చేరదీయడం ద్వారా కులపరమైన లబ్ధిని ఈ ఎన్నికలలో పొందాలని బీజేపీ ప్లాను వేసింది. అయితే ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమై బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయని విశ్లేషిస్తున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ అయిందని తాజాగా వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. మరి అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలను నడుపుతోంది... మరి ఆ రాజకీయాల పర్యవసానం ఎలా వుండబోతోందో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశానికి మిత్రపక్షంగా వుండి, అధికారంలో భాగస్వామ్యం పొందిన భారతీయ జనతా పార్టీ ఏపీలో తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటోంది. మిత్రుడు మిత్రుడే రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారశైలి వుంది. 2019లో వచ్చే ఎన్నికలలో ఏపీలో సొంతగా అధికారాన్ని సంపాదించేయాలన్న అత్యుత్సాహం బీజేపీ నాయకులలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే టీడీపీతో మిత్రధర్మాన్ని పాటించకుండా వ్యాఖ్యలు చేయడంతోపాటు కుల రాజకీయాలను కూడా నడుపుతున్నారని విశ్లేషిస్తున్నారు.

ఏపీ బీజేపీకి మొదటి నుంచి కమ్మ కులానికి చెందినవారే మహారాజపోషకులు. ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవడానికి ఆ కులం వారే ప్రధానంగా కృషి చేశారు. అయితే ఆ సామాజికవర్గం బీజేపీకి ఎంతగా ఉపయోగపడుతున్నా, ఎంతయినా వాళ్ళు టీడీపీకి అనుకూలంగా వుంటారు కాబట్టి, ఆ కులాన్ని పార్టీలో ఎదగనీయకూడదన్న ధోరణి ఏపీ బీజేపీలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాపు, రెడ్డి కులాలను మంచి చేసుకోవడం ద్వారా ఏపీలో రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్ళిపోవాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఆ ప్రయత్నాల్లోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు కులానికి చెందిన సోము వీర్రాజును నియమించబోతున్నారని సమాచారం. సోము వీర్రాజు సామాన్యుడేం కాదు.. బీజేపీ ఆలోచనలను అక్షరాలా అమలు పెట్టే ‘వాగ్ధాటి’ వున్న నాయకుడు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎదిగి ఆ పార్టీనే విమర్శించగల రాజకీయ చతురుడు. ఆ చతురతతోనే కాపులను, రెడ్లను బీజేపీకి స్నేహితులుగా చేసే కృషి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

ఆ కృషిలో భాగంగానే ఔట్ డేటెడ్ కాపు నాయకుడైన చేగొండి హరిరామ జోగయ్య రాసిన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నాయకులుహాజరయ్యారు. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం వుందని రాశారని తెలిసినా ఎంతమాత్రం ఇబ్బంది పడకుండా ఆ సభలో పాల్గొన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు మీద కోపం వున్న పురందేశ్వరి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రంగా హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నారన్న విషయం ఆమె మరిచారనుకోలేం. కాపులను మంచి చేసుకోవడం కోసం, చంద్రబాబు మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె ఆ సభకు మనసు రాయి చేసుకుని వెళ్ళి వుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ బీజేపీ నాయకులు మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్‌ని గ్రిప్‌లో పెట్టుకుని కాపు ఓటు బ్యాంకు సంపాదించుకుందామని అనుకున్నారు. అయితే నిలకడలేని పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే దేన్నో పట్టుకుని గోదారి ఈదినట్టని అర్థం చేసుకున్నారు. అందుకే ఇతర మార్గాల ద్వారా కాపులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటు కాపులతోపాటు వైఎస్ జగన్‌కి చేరువ కావడం ద్వారా రెడ్లను కూడా తమ పార్టీ వైపు తిప్పుకుని 2019 ఎన్నికలలో చక్రం తిప్పాలన్నది బీజేపీ వ్యూహంగా వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బీహార్లో కుల రాజకీయాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. మరి ఏపీలో ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నాయో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.