ఏపీలో బీసీ రక్షణ చట్టం.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో బీసీ సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం దిశగా కూటమి  వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో  బీసీల హక్కులను పరిరక్షణతో పాటు.. వారికి సమగ్రమైన చట్టబద్ధమైన రక్షణ కల్పించే  లక్ష్యంతో  బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని   మంత్రి నారా లోకేష్ ప్రకటన   ప్రాధాన్యత సంతరించుకుంది.  గతంలో లోకేష్   యువగళం పాదయాత్రలో,  ఎన్నికల ప్రచార సభలలో బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి ఆత్మీయ సమావేశాలలో లోకేష్ బీసీ రక్షణ చట్టంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలు   ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసుల  ముప్పు నుంచి వారికి శాశ్వత విముక్తి కలిగించడమే ఈ ప్రతిపాదిత చట్టం  ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. బీసీల సామాజిక, ఆర్థిక,  రాజకీయ వికాసానికి తోడ్పాటునందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని లోకేష్ పునరుద్ఘాటించారు. 

బీసీ రక్షణ చట్టం  వివరాలు,  నియమావళి,  అమలు తీరుతెన్నులను విశ్లేషిస్తే, రాష్ట్రంలో బీసీల ఇది  రక్షక కవచం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో  బీసీ వర్గానికి  ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు,  సామాజిక కార్యకర్తలపై అనేక రకాల అక్రమ కేసులు నమోదయ్యాయి.  సుమారు 26 వేల మందికి పైగా బీసీలపై వివిధ  పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుఅయ్యాయి. వారిని జైళ్ల పాలయ్యారు. తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.  ఇటువంటి అన్యాయాలను  పూర్తిగా అరికట్టేందుకు బీసీ రక్షణ చట్టం దోహదపడనుంది.

ఈ   చట్టం అమలులోకి వస్తే, బీసీలకు చెందిన వారిపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు, ఒకవేళ దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే బాధితులకు ఉచితంగా   న్యాయ సాయం అందించే బాధ్యతను ప్రభుత్వమే   స్వీకరిస్తుంది.  న్యాయపోరాటం చేయడానికి అయ్యే అన్ని రకాల ఖర్చులను కూడా ప్రభుత్వం తరఫున భరిస్తూ, వారికి నిరంతరం లీగల్ సపోర్ట్ అందిస్తుంది.

కేవలం రక్షణ చట్టానికే పరిమితం కాకుండా, బీసీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా పూర్వ  వైభవాన్ని తీసుకురావడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేయనున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ ఉపకులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సముచిత రీతిలో ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ రుణాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు,  ఇతర రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలలో బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్న లోకేష్.. వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. యువతలో వృత్తి నైపుణ్యాలను విస్తృతంగా పెంపొందించేందుకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నియోజకవర్గాల వారీగా చేపట్టి, యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా సొంతంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.  

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.