రెండు రోజుల పాటు అందరికీ అసెంబ్లీ ప్రవేశం.. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టానికి తెరలేచింది.  ఇప్పటివరకు కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల పహారా మధ్య  జరిగే అసెంబ్లీ సమావేశాలు.. ఇప్పుడు సామాన్య ప్రజలకు స్వాగతం పలకుతున్నాయి.  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనం తలుపులను సర్వమానవాళికి తెరిచి ఉంచాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. 

ఆయన నిర్ణయంతో    దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినదించిన  మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల  అసెంబ్లీ అన్న ఆయన ఆశయానికి  సజీవ రూపంగా నిలవనుంది. సాధారణంగా స్వాతంత్ర్య వేడుకలంటే కేవలం ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు జెండా ఆవిష్కరించడం, కొంతమందికి ప్రసంగాలు ఇవ్వడం, లైటింగ్ పెట్టడంతో సరిపెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఆ పద్ధతులకు భిన్నంగా  ప్రజలు, పాఠశాల విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా చట్టసభ ఆవరణలోకి వచ్చి వేడుకల్లో భాగస్వాములు అయ్యేలా  ప్రణాళిక  రూపొందించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆగస్టు 14 ,  15 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ గేట్లను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. ప్రతీ రోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ  ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో ధగధగమెరిసిపోయే అమరావతి అసెంబ్లీ భవనాన్ని, ప్రాంగణాన్ని   సందర్శించే ఈ వెసులుబాటు విద్యార్థులకు మన దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, మహనీయుల త్యాగాలు, చట్టసభల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలన్న సదుద్దేశంలో సదాశయంతో కల్పించినట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు.  

AP Assembly entry, Mana Sabha Jana Sabha, Ayyanna Patrudu speech, Amaravati Assembly lightings, Independence Day 2026 AP, AP Legislative Assembly open to public

By
en-us Political News

  
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.