మార్చి 7 వరకూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Publish Date:Feb 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 వరకూ జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బుధవారం (ఫిబ్రవరి 11) జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు బడ్జెట్ సమావేశాలు మొత్తం 17 దినాలు కొనసాగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు కూడా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెల 14న సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 17, 18 తేదీలలో సభలో బడ్జెట్ పై చర్చిస్తారు. 18వ తేదీన సభలో జరిగిన చర్చకు విత్త మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-assembly-budget-session-upto-march7th-25-213862.html
http://www.teluguone.com/news/content/ap-assembly-budget-session-upto-march7th-25-213862.html
Publish Date:Aug 1, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 29, 2026





