సాగని చర్చ...రేపటికి వాయిదా
Publish Date:Jan 3, 2014
Advertisement
అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభ సభ్యుల ఆందోళనలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలను కొనసాగించారు. స్పీకర్ ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు వినలేదు. దీంతో చేసేది లేక స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
ఇక ఇరు ప్రాంత సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. రెండు సార్ల వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ బిల్లు చర్చకు రాకుండానే ఈ రోజు సభలు వాయిదాలు పడ్డాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-assembly-adjourned-over-telangana-bill-39-28980.html
http://www.teluguone.com/news/content/ap-assembly-adjourned-over-telangana-bill-39-28980.html
Publish Date:Feb 24, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026





