అసెంబ్లీ వాయిదా..బీఏసీ తరువాతే
Publish Date:Dec 17, 2013
Advertisement
శాసన సభలో మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి పోటాపోటీగా సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ఫ్లకార్డులను తెలంగాణ నేతలు బలవంతంగా తీసుకోవడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేస్తూ బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి ప్రకటించారు. కాగా సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎవరిసీట్లలో వారు ముభావంగా కూర్చున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-assembly-adjourned-amid-protests-39-28447.html
http://www.teluguone.com/news/content/ap-assembly-adjourned-amid-protests-39-28447.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





