బడ్జెట్ అంటే  పంపకాలేనా ?

Publish Date:May 21, 2021

Advertisement

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఒకే ఒక్క రోజులో చాప చుట్టేసింది. రూ. 2 లక్షల 29 వేల పైచిలుకు బడ్జెట్’ను మరో మాట, మరో చర్చ లేకుండా, అసలు సభలో ప్రతిపక్షమే లేకుండా ‘మమ’ అనిపించింది. రాజ్యాంగ అనివార్యత దృష్ట్యానే కావచ్చు, ప్రభుత్వం ఒక్క రోజులోనే బడ్జెట్ క్రతువు మొతాన్ని కానిచ్చింది. ప్రతిపక్ష తెలుగు దేశం సమావేశాలను బహిష్కరించి, మాక్ అసెంబ్లీ నిర్వహించింది.  ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరోక్షంగా అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే, నిజంగా నిద్రపోయే వాళ్ళను లేపవచ్చును, కానీ, నిద్ర నటిస్తున్న వారిని, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ లేపలేరు.

ఇలా ఒక్క రోజులో గవర్నర్ అడ్రస్, బడ్జెట్ ప్రవేశ పెట్టడం ... ఆమోదం పొందడం... పనిలో పనిగా ... అధికార పార్టీ అధికార అసభ్య  భాషలో  పతిపక్షం మీద విమర్శలు గుప్పించడం ...  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సూక్తులు, సుభాషితాలు... అన్నీ అయిపోయాయి. నిజమే, ప్రస్తుతం  రోజుకో 20 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు, వంద పైచిలుకు కొవిడ్ మరణాలు నమోదవుతున్న పరిస్థితుల్లో, స్థిమితంగా ఓ పదిరోజులో పక్షంరోజులు సమావేశాలు నిర్వహించి, బడ్జెట్’ పై సవివరంగా చర్చించే పరిస్థితి లేదు. కానీ, ఒక్క రోజులో రూ. 2,29,779 కోట్ల బడ్జెట్’ను తూతూ మంత్రంగాకానీయడం, అంతగా సమర్ధనీయం కాదు. అలాగే, గవర్నర్ ప్రసంగాన్ని అదేతీరున  కానిచ్చడం కూడా ... విమర్శలకు తావిస్తోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం, తెలుగు దేశం సమావేశాలను బహిష్కరించి నిరశన తెలియచేసింది. మాక్ అసెంబ్లీ నిర్వహించి, ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తింది.

ఇక బడ్జెట్ విషయంలోకి వస్తే, మొత్తం బడ్జెట్’లో ఐదో వంతు మొత్తాన్ని, సంక్షేమం పేరిట, నేరుగా ఓటర్ల జేబులకు చేరే విధంగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కేటాయింపులు చేశారు. గత బడ్జెట్’లో పెద్ద పీట వేసిన విధంగానే, ఈ బడ్జెట్’లోనూ, ఆసరా, చేయూత, భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, ఇలా ... నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ములు జమచేసే పథకాలకే ప్రధాన్యత ఇచ్చారు. మొత్తం బడ్జెట్’లో ఐదో వంతు అంటే, రూ. 48.083.92 కోట్లు నేరుగా జనం జేబుల్లోకి చేరే విధంగా బడ్జెట్ రూపొందించారు. అంటే కాదు, ఓ వంక ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన విధంగా సుస్థిర అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అంటూనే, ఆర్థిక మంత్రి బుగ్గన, చివరకు, పిల్లలను  కూడా వదల కుండా(బహుశా ‘నేటి బాలరే రేపటి ఓటర్లు’ అనే విశ్వాసంతో కావచ్చు ఈ సారి మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చూపించరు,) ఏ సామాజిక వర్గానికి ఎంత మేలు జరుగుతుందో, ఏ వర్గానికి ఎంత ‘ఉచితం’ అందుతుందో  చూపించే ప్రయత్నం చేశారు. మంత్రి గారి మాటల్లోనే చెప్పాలంటే, మొత్తం 22 పథకాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమవుతాయి. ఇందుకోసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో రూ. 4,141 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. అయితే, ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అనే దానికి, అప్పు చేద్దాం అనే సమాధానమే వస్తోంది. ఈ 22 పథకాల్లో మిడు ముఖ్యమైన పథకాలు, వైఎసార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి పథకాల అమలుకు అవసరమయ్యే, రూ.16,890 కోట్లు, రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వివిధ సంస్థల నుంచి రుణాలను సేకరిస్తోంది.  

నిజానికి, బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని చూస్తే, పథకాలు, పందేరాల విషయంలో ఉన్న స్పష్టత, ఆదాయం విషయంలో కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఒక విధంగా చూస్తే బుగ్గన బడ్జెట్’లో వాస్తవ దృక్పధం లోపించిందనే అభిప్రాయం వినవస్తోంది. గత సవత్సరంలో మొత్తం రాబడి రూ. 1,61.958.50 కోట్లు ఉంటుంది ప్రభుత్వం ఆశించింది. కానీ, వచ్చింది, రూ. 1,18,063.09 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం, పరిస్థితి గత సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుందని, ప్రభుత్వం ఎలా అంచన కొచ్చిందో  కానీ,  నలుగు కీలక పద్దుల పరిధిలో, రూ.1,77,196.48 కోట్ల ఆదాయమ వస్తుందని అంచనాల లో చూపించింది. 

కానీ,  ఆర్థిక పరిస్థిటిపై కరోనా ప్రభావం, గత సంవత్సరం కంటే , ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా గత సంవత్సరం గ్రామీణ ప్రాంతాలపై అంతగా ప్రభావంచుపని కరోనా ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక ప్రభావం చూపుతోంది. మరో వంక, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన కట్టడి, వాక్సిన్’కు కలిపి రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మొత్తం ఏ లెక్కనా కరోనా కట్టడికి సరిపోదు. ముఖ్యంగా, వచ్చే సంత్సరం మార్చిలోగా, అవసరం అయితే గ్లోబల్ టెండర్లకు వెళ్లి అయినా, ప్రజలు అందరికీ టీకాలు వేయించవలసి ఉంటుంది. అయితే, కరోనాకు కేటాయించిన రూ.1000 కొట్లలో కేవలం రు.500 కోట్లు మాత్రమే వాక్సినేషన్’కు కేటాయించారు. ఇది వాక్సినేషన్’కు సరిపోదని అంటున్నారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా విషయంలో మొదటి నుంచి శ్రద్ద చూపడం లేదన్న, విమర్శలున్నాయి.అందుకు తగ్గట్టుగానే, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి.  మరో వంక రాష్టంలో కరోనా  కేసులు, మరణాలు కూడా  రోజు రోజుకు పెరుగుతున్నాయి.

అభివృద్ధి కోణంలో చూస్తే, బడ్జెట్ లో మూలా ధన వ్యయం పద్దు కింద చూపించడం అయితే, రూ.31,198.38 కోట్లు చూపించారు. అయితే, గత సంవత్సరం బడ్జెట్’లో చూపిన  రూ.29,907.62 కోట్లలో సగం కంటే కాసింత ఎక్కువగా, రూ. 18, 797.39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన ఈ సంవత్సరం అబివృద్ది వ్యయం ఇంకా కిందకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.  

ఇదిలా ఉంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం పాస్టర్లు, ఇమాంల పట్ల  గల ప్రత్యేక ప్రేమను మరో మారు ప్రకటించుకుంది. ఇటీవలనే, వారికి ఇస్తున్న నెలసరి జీతాన్ని రూ. 5000 నుంచి ఏకంగా రూ.10,000లకు పెంచిన ప్రభుత్వం బడ్జెట్ లో ఇందు కోసంగా  రూ.120 కోట్లు. అర్చకులకు కూడా అంటే మొత్తాన్ని కేటాయించింది. అయితే,రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవుల జనాభా హిందూ  జనాభాలో ఒక వంతు కూడా ఉండదు. అయినా అర్చకులతో సమనంగా పాస్టర్లు, ఇమాంలకు బడ్జెట్ కేటాయింపులు చేయడాన్ని, హిందూ  సంఘాలు  ప్రశ్నిస్తున్నాయి.అదీగాక, అర్చకులకు  దేవాలయాల ఆదాయం నుంచి, అర్చకులకు జీతాలు చెల్లిస్తోంది, కానీ, క్రైస్తవ ఫాదర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే సహజంగానే ప్రతిపక్షాలు బడ్జెట్ ‘ను తూర్పార పట్టాయి. అధికార పార్టీ నాయకులు ఆకాశానికి ఎత్తేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దివాలకోర్ బడ్జెట్ అంటూ తేల్చేశారు. మరి ప్రజలు ఏమంటారో ..

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.