ముందస్తు బెయిలు అనుమానమే.. న్యాయనిపుణులు

Publish Date:May 25, 2023

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు మృగ్యం అనే న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (మే 25) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే  ముగ్గురు సహ నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి బెయిలు వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం.   

వైఎస్ వివేక హత్యకు సూత్రధారులలో ఒకడిగా పేర్కొంటూ, కచ్చితంగా అరెస్టు చేస్తామని, చేయాలని సిబిఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్  దొరకడం కష్టం అంటున్నారు. అదే సమయంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అవినాష్ చెప్పినా ముందస్తు బెయిలు ఇచ్చే అవకాశం అణుమాత్రం కూడా లేదనీ, కానీ మానవతా దృక్ఫథంతో అరెస్టయిన తరువాత బెయిలు మంజూరు చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.  

సుప్రీం కోర్టు దృష్టికి అవినాష్ తరఫు న్యాయవాదులు ఆమె తల్లి అనారోగ్యం విషయాన్ని తీసుకువెళ్లినా న్యాయస్థానం పట్టించుకోకపోవడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జి విని, ఇంకా వినడానికి సమయం లేదని జూన్ 5వ తేదీకి కేసు వాయిదా వేశారు. అయితే, ఈనెల 25వ తేదీన నే కేసును విచారించి తీర్పును వెలువరించాలని వెకేషన్ కోర్టు బెంచ్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దీనితో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన కేసు ఇన్ వ్యాలీడ్ అవుతుందని వారు వివరిస్తున్నారు.     

By
en-us Political News

  
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.