వైసీపీలో మరో ట్రబులా‘ర్’!

Publish Date:Jul 20, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు, ఒకటొకటిగా బయట పడుతున్నాయి. వైసీపీ  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి చాలా కాలంగా, ప్రభుత్వ పనితీరును, ఎక్కడి కక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజులా నేరుగా  కాకుండా, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే, తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కు పెట్టారని అంటున్నారు.  

ఈ నేపధ్యంలో అయన, అధికారులు మంచివారేన‌ని, కానీ ఎక్క‌డో తేడా ఉందంటూ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయ. రాష్ట్రంలో ఒక్క ప‌ని కూడా ముందుకు సాగ‌డంలేద‌ని, అభివృద్ధి ఎక్క‌డా లేద‌ని,  మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని, కొంచే ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు.

 నిజానికి, గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచీ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇత‌ర నేత‌ల‌తో మొద‌టి నుంచి ఆయ‌న‌కు సఖ్యత లేదంటూ వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అయన దూరంగానే ఉంటున్నారు. మరో వంక వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో, తెలుగు దేశం సహా అన్నిపార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు. 

నిజానికి ఇటు అధికారుల నుంచి, అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటఫై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. అయితే, మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, పార్టీ నాయకులు, అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి, చెప్ప వలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి, అని చెప్పినట్లు సమాచారం. 

ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపధ్యంలో, అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో, ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా ?  లేరా ? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. 

అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవొద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో మాగుంట వైసీపీ త‌ర‌ఫున పోటీచేసే అవ‌కాశాలు లేనట్లేనని,  ఆయ‌న తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా  ఉంటే ఎంపీలు , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా  ఒకరొకరు పార్టీకి దూరం అవుతున్న నేపధ్యంలో, వైసీపీ నిట్టనిలువునా చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.