ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం

Publish Date:Apr 15, 2023

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణంలోలో మరో సంచలనానికి తెరలేచింది.  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సహా  అనేక మంది విచారించి,  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరు కీలక వ్యక్తులను ఆరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.  ఆదివారం (ఏప్రిల్ 16)  ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్  కు సీబీఐ సమన్లు జారీ చేసింది.

కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది.  మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంతో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే  ఆదివారం (ఏప్రిల్ 16)  ఆయన విచారణకు హాజరవుతారా లేదా  అనేది చూడావలసి వుందని అంటున్నారు.

గతంలో కవిత సహా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులకు, వారి బిజీ షెడ్యూల్  ఇతరత్రా కారణాలతో,  సీబీఐ, ఈడీ విచారణ తేదీలలో  వారు కోరుకున్న విధంగా మార్పులు చేసుకునే  వెసులుబాటు కల్పించింది. అదే విధంగా అరవింద్ కేజ్రివాల్ కోరితే విచారణ మరో రోజుకు వాయిదా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

కాగా  ఇదే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. అందులో ఏకే.. అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించారు. 

అదలా ఉంటే  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్యం కుంభకోణంలో  నోటీసులు జారీ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రూ.100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత మద్యం విధానమే అమలు అవుతోంది. మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ.. ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయటం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ  సమన్లు పంపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.  సీబీఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఆగదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని  సంజయ్ సింగ్ అన్నారు.  సీబీఐ  విచారణకు కేజ్రీవాల్ ఆదివారం (ఏప్రిల్ 16)వెళ్తారని  సంజయ్ సింగ్ తెలిపారు.

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.