ప్రధాని రేసులో మరో కృష్ణుడు

Publish Date:Sep 5, 2022

Advertisement

గుర్తుండే ఉంటుంది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపేందుకు, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, వామ పక్షాలు సహా  సుమారు ఓ 20 వరకు పార్టీలు సమాలోచనలు జరిపాయి. అదికూడా  ఒకసారి కాదు. దఫ దఫాలుగా మూడు నాలుగుసార్లు సమావేశమయ్యారు. చర్చలు జరిపారు. సంప్రదింపులు సాగించారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్,  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  కాంగ్రెస్ సీనియర్  నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి,  డి.రాజ... ఇలా ఒకరని కాదు,  విపక్ష్లాల ముఖ్య నేతలంతా రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి కోసం సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపారు. అలా సమావేశమైన ప్రతిసారి ఒక పేరు పైకి రావడం, వారు‘సారీ’ చెప్పి తప్పించుకోవడం ఒక ప్రహాసనంగా సాగింది. ముందు మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించారు, ఆయన నో..అన్నారు.ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లు ప్రస్తావన కొచ్చాయి.. ఆ ఇద్దరు కూడా .. సారీ ..చెప్పి తప్పుకున్నారు.

చివరాఖరుకు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా నాలుగో  కృష్ణుడిగా తెరపై కొచ్చారు. ఓటమి ఖాయమని తెలిసినా, పోటీచేశారు. ఓడిపోయారు.  అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకు చెపుతున్నట్లని, మీరు అడిగితే అడగవచ్చును. నిజమే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కర్చీఫ్ వేయడానికి, ఆనాటి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులుగా తెరపై కొచ్చి వెళ్ళిన వరస కృష్ణుల కథకు డైరెక్ట్ గా ఏ సంబంధమ లేక పోవచ్చును కానీ, కొంచెం లోతుగా చూస్తే బీరకాయ పీచు సంబంధం ఏదో ఉన్నట్లే ఉందని పిస్తోంది.. 
నిజానికి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రధాని మోడీని గద్దెడించాలనే బలమైన ఆకాంక్ష గాంధీల నుంచి కల్వకుంట్ల  ఫ్యామిలీ వరకు విపక్ష నేతలు అందరిలో వుంది.

అదే సమయంలో అందరికీ, అది ఏ ఒక్కరి వల్లో, ఎ ఒక్క కూటమి వల్లనే అయ్యే పని కాదని కూడా తెలుసు. అందుకే, 2024 నాటికి అందరూ కలిసి ఏకమై మోడీ ఓడించే ‘పవిత్ర’ యజ్ఞానికి అంకురార్పణగానే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధి ఆలోచన పురుడు పోసుకుంది.  అయితే,  ఆ ప్రహసనం, ఆ తర్వాత అదే పంధాలో సాగిన ఉప రాష్టపతి ఎన్నిక ప్రహసనం ఎలా ముగిసిందో అందరికీ తెలిసిన విషయమే. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం సాగిన విఫల యత్నంగా మిగిలి  పోయినా, అది అయ్యే పని కాదని ‘క్లియర్ కట్’ గా అందరికీ తెలిసి పోయినా, ప్రతిపక్ష పార్టీలు, పట్టు వదలని విక్రమార్కునిలా, భేతాళుడి శవాన్ని,  కథలను మోస్తూనే ఉన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, బీజేపీ యేతర ప్రభుత్వాన్ని గద్దె పై కూర్చో పెట్టేదుకు, ఎవరి ప్రయాణాల్లో వారున్నారు. అదేమీ తప్పుకాదు కానీ, 2024 ఎన్నికల ముఖ్యచిత్రంపై ప్రధాని రేసులో నిలుస్తున్న, కృష్ణుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటున్న రాహుల్ గాంధీ మొదలు, పట్టుమని పది మంది ఎంపీలు లేని, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వరకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ , ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఇప్పటికే ఓ అరడజను మంది వరకు ప్రధాని రేసులో ఉన్నారు. ఇప్పడు,అ జాబితాలో, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నితీష్ కుమార్ పేరు కూడా చేరింది.  

నిన్న మొన్నటి వరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ ఈ మధ్యనే కమలానికి కటీఫ్ చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్ కుతమితో జట్టు కట్టారు. ఇపుడు ఆయన కూడా, ‘పీఎం రేస్ 2024’లో కర్చీఫ్ వేశారు. అందుకే మళ్ళీ ఇప్పడు పౌరాణిక నాటకాల్లో, ఒకే పాత్రను నలుగురైదుగురు వేసినప్పుడు, ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు వచ్చి పోయినట్లుగా, ఇప్పడు ప్రధాని రేసులో మరో కృష్ణుడిగా నితీశ్ రంగ ప్రవేశం చేశారు. అయితే చివరాఖరకు ఉట్టి కొట్టే కృష్ణుడు ఎవరో .. ? ఇదీ అసలు సిసలు భేతాళ ప్రశ్న.

By
en-us Political News

  
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.