వైసీపీ సర్కార్ బరితెగింపునకు మరో నిదర్శనం

Publish Date:Nov 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు. అనర్హులకు కూడా ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లించేశారు. మొత్తంగా జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. నిబంధనలు అనేవి ఉంటాయన్న సంగతే ఆయా వ్యవస్థల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు సైతం మరచిపోయారా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండింది. 

ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నాడు జరిగిన తప్పులు, అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కు కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చే అక్రిడెషన్ కు ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిన విషయం బయటకు వచ్చింది. 

ఇంతకీ ఇంటూరి రవి కిరణ్ ఎవరంటే.. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అత్యంత అసభ్య పోస్టులను పెట్టే మొనగాడు. జగన్ భజన, జగన్ సర్కార్ వ్యతిరేకులపై అసభ్య పోస్టులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోవడంలో ఇంటూరీ ఆరితే రిపోయారు. ఆయన కృషి, ప్రత్యర్థులపై అసభ్య, అసహ్యకర పోస్టులు పెట్టడంలో ఆయన సృజన జగన్ ను మెప్పించింది. దాంతో ఆయన పనికి మెచ్చిన జగన్ తన హయాంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెలకు 73 వేల రూపాయల భారీ వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేశారు. తన భజన చేసినందుకు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వహననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రజాధనాన్ని ఇంటూరికి జగన్ అప్పనంగా దోచి పెట్టేశారన్న మాట.

అయితే అక్కడితో ఆగలేదు.. అర్హులైన జర్నలిస్టులకు కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టి మరీ నిరాకరించిన అక్రిడేషన్ ను ఎలాంటి అర్హతలూ లేని ఇంటూరి రవికుమార్ కు అతి సునాయాసంగా జారీ అయిపోయింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి అప్పనంగా వేతనం అందుకుంటూ, ఆ సంస్థ పే రోల్ లో ఉన్న ఇంటూరి రవికుమార్ కు జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ ఎందుకు ఇచ్చారంటే.. పాపం పౌరసరఫరాల శాఖ మాత్రం ఏం చెప్పగలదు? పైవాడు ఆదేశించాడు.. మేం ఆచరించామని బిక్కముఖం వేసుకోవడం తప్ప. జగన్ హయాంలో వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు ఎంతగా దిగజారి వ్యవహరించాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ హయాంలో జరిగిన పాపాల పుట్ట పగులుతోంది. సోషల్ మీడియాలో  అనుచిత పోస్టులతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇంటూరి ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. ఇక  నిబంధనలకు తిలోద కాలిచ్చేసిన అధికారుల వంతు రానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.