మరో చీతా మృతి

Publish Date:Apr 24, 2023

Advertisement

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒక మగ చీతా మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో  అనారోగ్యంతో మరణించింది. దీంతో విదేశాల నుంచి రప్పించిన చీతల్లో మరణించిన వాటి సంఖ్య రెండుకు చేరుకుంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ చీఫ్ కన్సెర్వేటర్ జేఎస్ చౌహన్ నిర్ధారించా రు.  దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే చీతా కునో జాతీయ పార్కులో అనారోగ్యం పాలై,  చికిత్స పొందుతూ మరణించింది. మరణం వెనుక కారణాన్ని కనుగొనాల్సి ఉంది. చీతా అనారోగ్యంపాలైన సంగతిని  అటవీ సిబ్బంది ఆదివారం (ఏప్రిల్ 23) గుర్తించారు. వెంటనే దానికి మత్తు మందు ఇచ్చి,  వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ   చీతా మరణించింది.

వెటర్నరీ వైద్యుల బృందం చీతా దేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టంను వీడియో తో పాటుగా ఫొటోలు కూడా తీస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి కునో జాతీయ పార్కుకు ఉదయ్ తో పాటుగా మరో 11 చీతాలను తీసుకొనివచ్చారు. మొత్తంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చిత్రాలను తీసుకొనివచ్చారు.

గతేడాది నమీబియా నుంచి పార్కునకు తీసుకువచ్చిన ఎనిమిది చీతాల్లో శషా అనే చీతా ఈ ఏడాది మార్చిలో మరణించింది. ఇప్పుడు రెండవ చీతా రెండు చితాలు మరణించినట్లైంది. అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన 20 చీతాల్లో రెండు మరణించగా వాటి సంఖ్య ఇప్పుడు 18కి పడిపోయింది.

ప్రధాని మోడి చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తెచ్చి, పార్కుల్లో వదిలితే.. ఇలా ఒక్కోక్క చీతా  మృత్యవాత పడటంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి ఆరోగ్య రక్షణ కోసం మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.