సాగర్ కమలానికి సవాలే! అక్కడ గెలిస్తే తిరుగులేనట్టే? 

Publish Date:Dec 3, 2020

Advertisement

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగబోనుంది. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కన మార్చి తర్వాత ఎప్పుడైన నాగార్జున సాగర్ ఎన్నిక రావొచ్చు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికపైనా అప్పుడే చర్చ మొదలైంది. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు కూడా  కొన్ని పార్టీలు ప్రారంభించాయని ప్రచారం జరుగుతోంది. దుబ్బాక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో దూకుడుతో ఊపు మీదున్న బీజేపీ.. నాగార్జున సాగర్ పైనా  ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.

 

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిచ్చి... అదే జోష్ తో జీహెచ్ఎంసీ పోరులో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన బీజేపీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మాత్రం సవాల్ గా మారనుందనే చర్చ జరుగుతోంది. దుబ్బాకతో పోలిస్తే నాగార్జున సాగర్ పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బీజేపీ ఇంత వరకు అసెంబ్లీ సీటు గెలవలేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే. నల్గొండ జిల్లాలోని మిగితా ప్రాంతాల కంటే నాగార్జున సాగర్ సెగ్మెంట్ లోనే  బీజేపీ పూర్ గా ఉందని చెబుతున్నారు. హాలియా పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనే కొంత బీజేపీ బలంగా ఉంది. దుబ్బాకలో అయితే బీజేపీకి కేడర్ ఉంది. గతంలో మెదక్ నుంచి బీజేపీ ఎంపీ సీటు కూడా గెలిచింది. ఈ లెక్కన దుబ్బాకతో పోలిస్తే నాగార్జున సాగర్ లో బీజేపీ చాలా వీక్ అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ ఎలాంటి పోటీ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డి పోటీ చేశారు. ఆమెకు కేవలం ఒక్క శాతం ఓట్లే పోలయ్యాయి. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ కంటే సమాజ్ వాదీ బ్యాక్ వర్డ్ పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎస్పీ అభ్యర్థికి 9 వేల 819 ఓట్లు రాగా నివేదిత కేవలం 2 వేల 675 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. బీజేపీ నుంచి పోటీ చేసిన నివేదిత రెడ్డి భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ బలపడిందని చెబుతున్నారు. అయితే గెలిచేంత స్థాయికి మాత్రం రాలేదంటున్నారు.  

 

నాగార్జున సాగర్  గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేయగా ఏడు సార్లు గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జునసాగర్‌ స్థానానికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎం నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,771 ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై సంచలన విజయం సాధించారు.  

 

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రెడ్డి, యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు వర్గాల వారే ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తుంటారు. బీజేపీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను బట్టి నిర్ణయం తీసుకునే ఉంది.  నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా జానారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో నిలవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగితే మాత్రం టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీనే ఉంటుంది. జానారెడ్డి తప్పుకుని ఆయన కొడుకుతో పోటీ చేయిస్తారనే చర్చ కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి జానారెడ్డే పోటీ చేశారు. మరోవైపు జానారెడ్డి కొడుకుతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దుబ్బాకలో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. తమకు ఇప్పటివరకు ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. తెలంగాణలో ఆ పార్టీకి ఇక తిరుగు ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.