మూడో ఫ్రంట్ కోసం మరో ప్రయత్నం..ఈ సారి ఐఎన్ఎల్డీ నేత చౌతాలా

Publish Date:Sep 8, 2022

Advertisement

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి దిశగా మరో ప్రయత్నం ప్రారంభమైంది. ఇందు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ  జట్టుకట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆర్ఎన్‌ఎల్డీ నేత చౌతాలా ఇందుకు నడుం బిగించారుర. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమైన నేపథ్యంలో తాజాగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు చౌతాలా నడుంబిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఇందుకోసం ఆయన తన స్వ రాష్ట్రం అయిన హర్యానాలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు ఈ నెల 25 ముహూర్తం ఫిక్స్ చేశారు.  ఆ రోజే ఎందుకంటే సెప్టెంబర్ 25 మాజీ  ఉప ప్రధాని దేవీలాల్‌ జయంతి కనుక.  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి  బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో లేని అంటే ఎన్డీయేతర, యూపీఏయేతర పార్టీల నేతలను ఆహ్వానించారు.

 సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌, జేడీ ఎస్ నేత దేవెగౌడ, అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఈ సమావేశానికి హాజరయ్యేందకు ఇప్పటికే అంగీకారం తెలిపారని చౌతాలా పేర్కొన్నారు.  ఎన్సీపీ , టీఎంసీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ , ఆర్‌ఎల్డీ వంటి పార్టీలనూ ఆహ్వానించినప్పటికీ ఆయా పార్టీల నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. గతంలోనే ఇటువంటి ఐక్యత కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఐఎన్ఎల్డీ నుంచి ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియరాలేదు.

ఒక వేళ అందినా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. కాగా తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే అభిప్రాయం ప్రకారం బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అంటే అంతిమంగా అది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేదిగానే మిగిలిపోతుంది.   కాంగ్రెస్ నేతృత్వంలో  బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి నడిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్నది పీకే అభిప్రాయం.

ఇక కేసీఆర్ కూడా ఇటీవలి పరిణామాల అనంతరం కాంగ్రెస్ పంచన చేరాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 25న నిర్వహించనున్న ప్రాంతీయ పార్టీల సమావేశానికి హాజరవ్వడం అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.