ఏపీ సర్కార్ కు మరో సలహాదారు..!

Publish Date:Nov 18, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు ఎంత మంది సలహాదారులున్నా సరిపోవడం లేదు. రోజుకొక సలహాదారు చొప్పున నియామకాలు  జరుగుతున్నాయా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

కనిపించిన వారందరికీ పదవులు కట్టబేట్టేయాలన్న తొందర జగన్ లో కనిపిస్తోంది. ఎవరిలోనైనా పదవి దక్కలేదన్న కించిత్ అసంతృప్తి పొడసూపుతోందన్న అనుమానం వస్తే చాలు వారకి ఓ సలహాదారు పదవి కట్టబెట్టేస్తున్నారు.  పార్టీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేసేయాలన్న ఆత్రంతో సలహాదారు పదవుల పందేరంలో మరే విషయంలోనూ లేనంత వేగం చూపుతున్నారు

ముఖ్యమంత్రి జగన్ . తాజాగా వైసీపీ అధికార ప్రతినిథి నారమల్లి పద్మజకు సలహాదారు పదవిని కట్టబెట్టేశారు. ఆమెకు మహిళాశిశుసంక్షేమ, దివ్యాంగ వృద్ధుల విభాగానికి సలహాదారుగా పదవిని కట్టబెట్టేసారు. ఈ పదవి దక్కిన ఆమెకు నెలకు లక్షల్లో వేతనం లభిస్తుంది. సలహాదారు పదవుల నియామకం విషయంలో జగన్ ఒక పద్ధతీ పాడూ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే దిక్కు లేదు కానీ.. అయిన వారికి సలహాదారు పేరుతో లక్షల ప్రజాధనాన్ని వేతనాలుగా నిర్ణయించి నియామకాలు కానిచ్చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి నాలుగళ్ల కిందట వైసీపీ గూటికి చేరిన నారుమల్లి  పద్మజారెడ్డి ఇంత కాలం వైసీపీ అధికార ప్రతినిథిగా మీడియా ముందుకు వచ్చి, లేదా సామాజిక మాధ్యమంలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నారు. ఇంతగా నోరు చేసుకున్నందుకు ఏదో పదవి కావాలని ఆమె గత నాలుగేళ్లుగా జగన్ ను కోరుతూనే ఉన్నారు.

ఇక ఇప్పుడు ఎన్నికల వేడి మొదలు కావడంతో  ఇప్పటికీ పదవి ఇవ్వక పోతే ఆమె నొచ్చుకుంటారనుకున్నారో ఏమో.. జగన్ మరో సలహాదారు పదవిని సృష్టించి ఆమెకు కట్టబెట్టేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే శాఖలలో అయితేనేం దాదాపు 80 మంది సలహాదారులు ఉన్నారు. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.