రాయచోటిలో నిరసన జ్వాలలు...మూకుమ్మడి రాజీనామాలు
Publish Date:Dec 29, 2025
Advertisement
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడంపై రాయచోటిలో నిరసన జ్వాలలు రగిలాయి. ర్యాలీలతో పాటు పలువురు పదవులకు రాజీనామాలు చేశారు. మూడున్నరెఏళ్ళుగా జిల్లా కేంద్రంగా ఉండి పలు భవనాలకు స్థలాలు, నిధులు సమకూర్చుకొని ,జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పరిపారన సాగుతున్న తరుణంలో ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. రాయచోటిపై రాజకీయ కక్ష సాధించవద్దని కోరుతూ కొందరు పదవులకు రాజీనామా చేస్తూ మాట్లాడారు. జిల్లా కేంద్రాన్ని మార్పు చేయడం ద్వారా రాయచోటి వాసులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రజాధనం కూడా వృధా అవుతుందని, ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని మార్చకుండా రాయచోటి లోనే కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. మహా ర్యాలీ రాయచోటి జిల్లా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ పట్టణంలోని శివాలయం చెక్ పోస్ట్ నుంచి నేతాజీ సర్కిల్, జామియా మసీదు సర్కిల్, గాంధీ బజార్, వైయస్సార్ సర్కిల్ ల మీదుగా బంగ్లా సర్కిల్ వరకు మహా ర్యాలీ చేశారు. మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. *రాజీనామాలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిరసనగా రాయచోటిలో మొదలైన రాజీనామాల పర్వం మొదలైంది. రాయచోటి పట్టణంలో 22వ వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి, అయిదవ వార్డు కౌన్సిలర్ పోలంరెడ్డి విజయమ్మ లు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రం రాయచోటిని మార్పుకు నిరసనగా పలువురు కౌన్సిలర్లు రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వెనుకబడిన రాయచోటికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరొకసారి తమ నిర్ణయాన్ని పునరాలోచిన చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు.
http://www.teluguone.com/news/content/annamaya-district-36-211751.html





