పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్‌మాస్టర్‌కి ఆయన మనవడు ముద్దిచ్చే బడికి పంపేడు. మరణానికి మరింత దగ్గర్లో వున్న తండ్రికి రమ్ ఇచ్చి ఆనందపరిచింది పెన్నెలోప్ ఆన్! చిన్న ప్పటి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బడికి పంపిన తండ్రి పెదాల మీద చివరి చిర్నవ్వు కోసం ఆన్ తనకు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వక తప్పలేదు.
కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్టమైన పని చేయవలసి వస్తుంది. ఆన్ తండ్రి చక్కగా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్‌బెర్గ్ రమ్ అంటే మహా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగడం పెద్దగా నచ్చేది కాదు. ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గమనించి ఆస్పత్రికి తీసికెళ్లారు. పెన్నెలోప్ తండ్రికి క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. చాలారోజులు ఆస్పత్రిలోనే వుండాల్సి వచ్చింది. జబ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఆన్ తండ్రిని కోల్పోయే సమయం ఆసన్నమైంది. డాక్టర్లు ఆ సంగతి ఆమెకు చెప్పక తప్పలేదు. ఆమె బాధపడింది ..లోలోపల. తండ్రితో వున్న అనుబంధంతో ఆయన పడక దగ్గర ఏడవలేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్రశాంతంగానే వుండాలనుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ సరదా వాతావరణాన్నే కల్పించింది.
చివర్రోజు.. ఆన్ ఆస్పత్రిలో తండ్రి దగ్గరకి మందులు తీసికెళ్లింది. ఆయన నవ్వాడు. దగ్గరికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్టమైన నా మందు కావాలని కోరాడు. ఆన్‌కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గట్టిగా నవ్వింది. పరుగున వెళ్లి ఆయన అమితంగా ఇష్టపడి తాగే బండ్‌బర్గ్ రమ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్టర్ల అనుమతితో సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయనకు ఎంత సరదానో.. రోజూ తిట్టే కూతురు స్వయంగా తనకు ఆ మత్తెక్కించేందుకు డాక్టర్‌కి సాయపడుతోందని.
కొద్ది గంటల తర్వాత ఆన్ తండ్రి ప్రశాంతంగా వెళిపోయారు. ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివరి క్షణాలు ఆనందంగా గడపడానికి ఆయన చివరి కోరిక తీర్చడంలో వుండే ఆనందం ఆమె మనసు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాపకంగా వుంటుంది ఇక!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ann-let-her-father-his-last-cheer-39-139045.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.