Publish Date:Jul 22, 2025
వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ పోలీసులకు తెలిపినట్లు టాక్. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు.
పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు.. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. శశిధర్‌రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపాం.’’ అని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశామని హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్‌లో వెంచర్లు వేశామని శ్రీకాంత్ పేర్కొన్నారు. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరిట వెంచర్ - తుర్కయాంజల్‌లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశాం - 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్‌కు మకాం మార్చాని కేసులకు భయపడి హైదరాబాద్‌కు మకాం మార్చాని శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల విచారణలో తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anil-kumar-yadav-25-202500.html
బీహార్ లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో ఉంటే.. తమిళనాడులో ఆరున్నర లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయట. ఈ ఓట్లు ఎక్కడివాని చూస్తే ఇవి వలస వచ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబరం. ఎందుకంటే వలస వచ్చిన వాళ్లకు ఇక్కడేం జరుగుతుందో తెలీదు. ఇక్కడి రాజకీయాలు అసలే పట్టవు.
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పోరాటంలో, మడమ తిప్పని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్పటి వరకూ ఆయన 8 సార్లు లోక్ సభ కు, రెండు సార్లు రాజ్య సభకు ఎన్నికైన శిబుసొరేన్ , జార్ఖండ్ సీఎంగా ఎనలేని సేవలందించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.
భారత్, రష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా బెదిరింపు అస్త్రాలు సంధిస్తూనే ఉంది. రష్యాను ఏకాకిని చేయాలనో? లేక భారత్‌ను తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనో? కారణం ఏదైతేనేం అమెరికా అధికార ప్రతినిధులు ఒకరి తర్వాత మరొకరు భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్ దంపతులు కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టిని కేంద్రీకరించిందా?
ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు.
జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు.
పూజకు దైవభక్తి మెండు. నిత్యం పూజలూ, పునస్కారాలతోనే గడుపుతుంటుంది. ఆమె భక్తి మూఢ భక్తి లిమిట్ కూడా దాటిపోయింది.
నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.
పులివెందల..ఆ పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ.. అంటే 1978 నుంచి ఇప్పటివరకు పులివెందుల లో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే అన్నట్లుగా వైఎస్ హవా సాగింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ హావా కొనసాగిస్తూ వచ్చారు.