యాంగర్.. ఎమోషన్.. ఇన్స పిరేషన్.. చంద్రబాబులో కొత్త డైమన్షన్స్!

Publish Date:Nov 18, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరికొత్త డైమన్షన్స్  తో జనం మధ్యకు వచ్చారు. ఇంతకు ముందు కన్నా చంద్రబాబు మాటల్లో మంచి ఫైర్ కనిపిస్తోంది. చెప్పాల్సిన విషయం జనం గుండెలను సూటిగా తాకేలా చెబుతున్నారు. సీఎం జగన్ రెడ్డిపై నిశితంగా విమర్శలు చేస్తూనే.. పదునైన మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్ పాలనా విధానాలను తూర్పారపడుతూనే.. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనేది క్లియర్ గా చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబులో ఈ సరికొత్త యాంగిల్ స్పష్టంగా కనిపిస్తోందని జనం అంటున్నారు. చంద్రబాబు తాజాగా మాట్లాడుతున్న మాటల్ని చూస్తే.. ఆయనలో ఇంత ఫైర్ గతంలో ఎప్పుడూ చూడలేదని జనం ఆశ్చర్యపోతున్నారు.

 జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపితే తప్ప ఏపీకి.. రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదు. రాష్ట్రానికి వైసీపీ దొంగలు చేసిన అన్యాయం మర్చిపోతామా?  అంటూ   నిప్పులు చెరుగుతున్నారు.  నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేదంటే నేను అసెంబ్లీ వెళ్లలేను  అని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ప్రజలకు ఎంత అవసరమో  సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకునేలా చెబుతుండడం గమనార్హం.  నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయలేదు. కానీ.. జగన్ సారథ్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా నన్ను.. నా సతీమణిని అవమానించారు.   అది గౌరవసభ కాదు.. కౌరవసభ. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆ రోజు చెప్పాను. నేను అసెంబ్లీ వెళ్లాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే.. రేపు జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నా’ అని చంద్రబాబు చేసిన అప్పీల్ ప్రజలను కదిలించేదిగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి కోలుకోకుండా చేస్తా.. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారనే కక్షతో రోడ్ల విస్తరణ పేరుతో గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లన్నీ కూలగొట్టారు. ఎంత కొవ్వెక్కితే.. ఇలాంటి దుర్మార్గాలకు దిగుతారు? నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై తిరిగేవారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందర్నీ కలుపుకుని వెళ్లాం. ఓట్లు వేయటం మీ ఇష్టం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా నా బాధ్యత’ వచ్చే ఎన్నికల్లో టీడీపీని మీరు గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే సరి.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక’ అని చంద్రబాబు అంటూ.. ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అవడంతో ప్రజలు కదిలిపోయారు.

‘జగన్ ఇచ్చేది గోరంత.. దోచేసేది కొండంత. జగన్ రెడ్డీ మీ నాన్నను చూశా.. మీ తాతను చూశా.. నీకు భయపడతానా..? నేను ఎవరికీ భయపడను’ అంటూ జగన్ కు చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేయడం విశేషం. ‘ఏపీలో భూ బకాసురుడిని, నరరూప రాక్షసుడిని కట్టడి చేయాలి.. లేదంటే ఎవరినీ వదిలిపెట్టడు’ అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన సూచన చేశారు. ‘రాష్ట్రంలో రోడ్ల గుంతల్లో గంపెడు మట్టి వేయని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతానంటే ఎలా నమ్మాలి?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘జగన్ కు పాలించడం చేతకాదు. నియంతలా మారాడు. అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీంను మించిపోయాడు. మద్యం తయారీ కేంద్రాలన్నీ జగన్ వే.. ఆరు వేల స్కూళ్లను మూసేశాడు. ఒక్క టీచర్ పోస్లు కూడా భర్తీ చేయలేదు. రాయలసీమకు ఒక్క పరిశ్రమను కూడా తేలేదు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు’ అని చంద్రబాబు ప్రజలను హెచ్చరించడమే కాకుండా, ‘తన బాబాయ్ వివేకానందరెడ్డిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపర్లో రాశారు. తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లింది. జగన్ ఏలుబడిలో ఉన్న ఏపీలో తనకు న్యాయం జరగదని, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పోరాటం చేస్తోంది. ఆమెకు మనమంతా అండగా నిలబడదామ’ని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ఎప్పుడైనా.. ఎక్కడైనా సందర్భానికి అనుగుణంగా, వివరణాత్మకంగా మాట్లాడతారనే పేరుంది. అలాంటి చంద్రబాబులో కర్నూలు జిల్లా పర్యటనలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్న తీరు, కొత్త తరహాలో మాట్లాడుతున్న వైనం బాగా ఆకట్టుకుంటోంది.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.