Publish Date:Jul 22, 2025
మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ వేసిన 305 పేజీల ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించినది ఏ 1 రాజ్ కేసిరెడ్డి. అంతే కాదు ఈ డబ్బులతో ఆయన గచ్చిబౌలిలో ఒక ప్లాట్ ఆపై వివిధ ప్రాంతాల్లో 92 ఎకరాల మేర తన తల్లి, తన సంస్థ ఎషాన్ ఇన్ ఫ్రా పేరిట ఈ భూములు కొన్నట్టుగా గుర్తించారు విచారణాధికారులు. ఈ భూముల విలువ 110 కోట్ల మేర ఉంటుందంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ బినామీ సొమ్మును పరి పరివిధాలుగా ఖర్చు చేయడానికి రాజ్ కేసిరెడ్డి, అతడి అనుచర గణం.. ప్రయత్నంచినట్టు తెలుస్తోంది. జాంబియా, టాంజీనియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో మైనింగ్ చేయడానికి గల అవకాశాలు కూడా వీరు పరిశీలించినట్టు కనిపిస్తోంది. ఈ దిశగా వీరు ఆయా దేశాలకు ట్రిప్పులు వేసినట్టు కూడా గుర్తించారు విచారణాధికారులు. యూఏఈ, యూకేల్లోనూ రకరకాల కంపెనీలు స్థాపించినట్టు గుర్తించారు. ఇందుకోసంగానూ రాజ్ కేసిరెడ్డి అండ్ కో ఏకంగా 28 సార్లు ఫారిన్ టూర్లు వేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఎన్నికల్లో నగదు పంపకాల కోసం ఎంత మొత్తం వాడారని చూస్తే.. సుమారు 200 కోట్ల రూపాయల మేర.. ఈ మద్యం డబ్బులోంచి వాడినట్టు సిట్ గుర్తించింది ఇందుకోసం హైదరాబాద్, తాడేపల్లిలో కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు విచారణాధికారులు. ఇదంతా ఏ 38 చెవిరెడ్డి అధ్వర్యంలో నడిచినట్టు సమాచారం. ఈయన సూచనల మేరకు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత మొత్తం సొమ్ము ఎక్కడికి తరలించాలో పథక రచన చేసినట్టు చెబుతున్నారు. ఒక సారికి ఒక ట్రిప్పులో 8 నుంచి 12 కోట్ల రూపాయల మేర సొమ్ము తరలించినట్టు తెలుస్తోంది. ఇందుకు తుడా వాహనాలను సైతం వాడినట్టు గుర్తించారు.ఇలా ఎన్నికలను ప్రభావితం చేయడానికి కూడా ఈ మద్యం సొమ్ము వాడినట్టు గుర్తించింది సిట్. ఇప్పటి వరకూ అరెస్టయిన వారిలో మిథున్ రెడ్డి రెండో రాజకీయ ప్రతినిథి కాగా.. మిగిలిన వారు ఎప్పుడన్నది ఉత్కంఠగా మారింది.
ఏ5 విజయసాయిరెడ్డి ఎప్పుడు అరెస్టు అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి.. అప్రూవర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అదలా ఉంటే ఆలస్యం అవుతుందేమోగానీ ఆయన అరెస్టు మాత్రం పక్కా అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్ మెంట్ ఈ మొత్తం ఇష్యూలో రెండు మూడు ప్రధానమైన ఘట్టాల్లో ఉన్నట్టు సిట్ గుర్తించింది. మరి చూడాలి మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్టు తర్వాతి బిగ్ వికెట్ ఎవరిదో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhrapradesh-liquor-scam-sit-chargesheet-39-202475.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.