మాజీ ప్రధాని పీవీపై చంద్రబాబు ప్రశంసలు
Publish Date:Jul 15, 2025
Advertisement
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించిన చంద్రబాబు . అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు. దేశంలో లైసెన్స్ రాజ్ విధానానికి స్వస్తి చెప్పారని, పెట్టుబడిదారులు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకుని దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేసిన సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చిందన్న ఆయన.. . పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారని గుర్తు చేశారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు.. 2014లో మోడీ కూడా అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మోదీ హయాంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్‌పేరుతో ముందుకెళ్తున్నాం.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచామన్నారు.
మంగళవారు (జులై 15) ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. పలు వురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్‌తో పాటు.. ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. వీటితోపాటు, ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
http://www.teluguone.com/news/content/andhrapradesh-cm-cbn-praises-former-pm-pv-25-202058.html





