అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
Publish Date:Sep 1, 2014
Advertisement
అమెరికాలోని పనామాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ప్రకాశం జిల్లాలోని కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సాయికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో చేరాడు. ఆదివారం నాడు సాయికృష్ణ మృతదేహాన్ని పనామాలోని ఒక స్విమ్మింగ్ పూల్‌లో పోలీసులు కనుగొన్నారు. హ్యూస్టన్ నుంచి పనామాకు సాయికృష్ణ విహార యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. సాయికృష్ణ మరణం ఎలా సంభవించిందనే అంశం మీద ఇంతవరకు స్పష్టత లేదు. అక్కడి పోలీసులు దీనిని అనుమానాస్పద మరణంగా విచారణ జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-student-death-in-america-39-37811.html
http://www.teluguone.com/news/content/andhra-pradesh-student-death-in-america-39-37811.html
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026
Publish Date:Sep 18, 2026





