ఏపీ స్థానిక ఎన్నికల వేడి: రాజకీయ ఉద్రిక్తతలు.. సంస్థాగత బాధ్యతలు.!

Publish Date:Oct 24, 2026

Advertisement

ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం హాట్ టాపిక్ గా మారాయి.  ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాలలో  పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల బెదిరింపులు, భౌతిక దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ ఈ హింసాత్మక ఘటనలపై పరస్పర విమర్శలతో మాటల యుద్ధానికి దిగాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని దుయ్యబడుతోంది. అయితే అధికార  యంత్రాంగం మాత్రం శాంతిభద్రతలను కాపాడటానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.  

వైసీపీ ఓటమి భయంతోనే  ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నదనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నదనీ అధికార తెలుగుదేశం కూటమి విమర్శిస్తున్నది.   నామినేషన్ పత్రాలను చించివేయడం, ఎన్నికల అధికారులపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తుతోంది. 

రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎన్నికల హింసకు, అక్కడ వేళ్లూనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పార్టీలకతీతంగా కొన్ని ప్రాంతాలలో సాగే ఈ ఆధిపత్య పోరు, ఎన్నికల సమయానికి మరింత హింసాత్మకంగా మారడం కద్దు. ఇప్పుడూ అదే జరుగుతోంది. స్థానిక సంస్థల మీద పట్టు సాధించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వనరులు, కాంట్రాక్టులు, స్థానిక భూభాగాలపై ఆధిపత్యం దక్కుతుందన్న ఉద్దేశమే ఈ ఘర్షణలకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే నామినేషన్ల కేంద్రాల వద్ద పేపర్లు లాక్కోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. గ్రామాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ వర్గాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలను ఒక యుద్ధ రంగంగా మారుస్తున్నారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, సామాన్య ప్రజలు భయంతో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి దారితీస్తోందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక పార్టీకి లేదా ప్రభుత్వానికి సంబంధించినవి కావు; ఇవి మొత్తం రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న పరీక్ష. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై మరింత పకడ్బందీ విధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.

[Andhra Pradesh Local Elections, Political Clashes, Rayalaseema Factionalism, Election Related Unrest, Telugu One]

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.