ఐపీఎస్‌లూ.. ఆఫీసుకు రావాల్సిందే!
Publish Date:Aug 14, 2024
Advertisement
జగన్ రాక్షస పాలనకు సహాయ సహకారాలు అందించిన చాలామంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్‌లో వున్నారు. వాళ్ళు ఈ వెయిటింగ్ కాలంలో ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో అలా కుదరదని, వెయిటింగ్‌లో వున్నప్పటికీ ఐపీఎస్ అధికారులు ప్రతిరోజూ వారి వారి హెడ్ క్వార్టర్‌కి వచ్చి రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. వెయింటింగ్‌లో వుండి, హెడ్ క్వార్టర్స్.కి అందుబాటులో లేనివారికి మెమోలు జారీ చేశారు. డీజీ ర్యాంకు అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు డీజీజీ మెమెలో జారీ చేశారు. వీరందరూ ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే వుండాలని ఆదేశించారు. విధులు ముగిసిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలని ఆదేశించారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే!
http://www.teluguone.com/news/content/andhra-pradesh-ips-officers-25-182972.html





