ఏపీకి మరో తుపాను ముప్పు.. ముందస్తు చర్యలకు సీఎం చంద్రబాబు సమీక్ష.!

Publish Date:Oct 31, 2026

Advertisement

అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, మరో తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా బలపడే అవకాశాలున్నాయని, నవంబర్ 2, 3, 4 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. 

సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సోసైటీ నుంచి రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అర్నబ్ తుపాను విధ్వంసం అనంతరం చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రసుత్తం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనాన్ని ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్ రాడార్ల ద్వారా ప్రతి ఆరు గంటలకు ఓసారి అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా గుర్తించి తగిన ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 

మొబైల్ నెట్వర్క్‌కు అంతరాయం లేకుండా ప్రణాళిక.!

విద్యుత్ అంతరాయం ఏర్పడినా మొబైల్ నెట్‌వర్క్ పనిచేసేలా అన్ని మండల కేంద్రాల్లో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని బీఎస్ఎన్ఎల్ 4,500 టవర్లతో పాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు నిరంతర విద్యుత్ అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 7 వేల మంది సిబ్బంది, 400 యంత్రాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 

వీటిని వేగంగా పూర్తి చేసి అన్ని గృహాలకు విద్యుత్ సరఫరా అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను సమయంలో  దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. కాకినాడ వద్ద ప్రొటెక్షన్ వాల్‌ను పునరుద్ధరించాలన్నారు. నరసాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో కాలువల పూడిక తొలగించాలని సూచించారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నీరు దిగువ ప్రాంతాలకు సజావుగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. భవిష్యత్తులో రోడ్లు, కాలువలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక ఎస్ఓపీ రూపొందించాలని ఆదేశించారు.

ప్రతి రైతుకూ పంటల బీమా భరోసా.!

ప్రకృతి విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్ నుంచి ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 47 లక్షల మంది రైతులకు చేరువయ్యేందుకు యాప్‌ను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం కల్పించాలని చెప్పారు. సాంకేతికతను వినియోగిస్తున్న చాంపియన్ రైతులను గుర్తించాలని సూచించారు. 

అర్నబ్ తుపాను వల్ల కొబ్బరి, అరటి పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కొబ్బరి పంట దెబ్బతిన్న 1,293 హెక్టార్లకు హెక్టారుకు రూ.54 వేల చొప్పున, నేల కొరిగిన, తలలు దెబ్బతిన్న ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. సుమారు 1.95 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. అలాగే 15 వేల హెక్టార్లలో దెబ్బతిన్న అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విద్యుత్, విపత్తుల నిర్వహణ శాఖల ఉన్నతాధికారులు, వివిధ టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

 

[ Andhra Pradesh Cyclone Alert, CM Chandrababu, AP Weather Update, New Cyclone Threat, Bay of Bengal Depression, Cyclone Warning, AP Government, CM Chandrababu Review, Cyclone Preparedness, Heavy Rainfall Alert, South Coastal Andhra, Rayalaseema, Arnab Cyclone Damage, Disaster Management, RTGS, Mobile Network Connectivity ] 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.