Publish Date:Oct 16, 2019
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది, కార్పొరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్ధల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాంకేతిక అడ్డంకులను అధిగమించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. చేనేత కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆమోదం తెలియజేసింది. మరోవైపు మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది సర్కార్. ఇక డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్ క్రాంతి పథకాన్ని మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. వివాదంగా ఉన్న పోలవరం రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పదిహేను అంశాలతో కూడిన అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ప్రారంభమైంది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయటంతో పాటుగా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చేదిశలో కూడా ఈ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి దీంట్లో భాగంగా చేనేత కార్మికులకు ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్ధికసాయం ఇవ్వాలన్న అంశానికి సంబంధించిన వ్యవహారాల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు విధి విధానాలు ఖరారు చేయనున్నారు.
కాబట్టి ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారు. అలాగే సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ, అంటే ఇసుక రవాణాకు సంబంధించి ఆరు వేల వాహనాలను సబ్సీడీ ద్వారా కార్పొరేషన్ ల సాయంతో లబ్ధి దారులకు అంధించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ వ్యవహారం మీద చర్చించటంతో పాటుగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో దానికి ఇవాళ క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో యాభై శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక కార్పొరేషన్ ని,వివిద అంశాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. వాటర్ గ్రిడ్ కు సంబంధించి నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో ఒక పథకాన్ని రూపొందించబోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-cabinet-meeting--25-90155.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.