ఆంధ్రాబడ్జట్- అంకెలు బాగున్నాయి కానీ...

Publish Date:Mar 10, 2016

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌.... ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు! ఒకపక్క తనకంటూ ఓ రాజధాని కూడా పూర్తి కాలేదు. మరోపక్క కేంద్రం నుంచి వస్తుందన్న సాయం మీద స్పష్టమైన మాటలు వినిపించడం లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి భుజం తట్టి వెళ్లిపోయేవారే కానీ, చేయి పట్టుకుని నడిపించేవారు కనిపించడం లేదు. ఎలాగొలా నిలదొక్కుకుందామని అనుకుంటే అదను చూసుకుని అజమాయిషీ చేసే ఉద్యమాలు మొదలయ్యాయి! ఒకరకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో రియల్ఎస్టేట్‌ వ్యాపారులు తప్ప మరెవ్వరూ అంత సంతృప్తిగా ఉండే పరిస్థితులు లేవు. ఇలాంటి గడ్డుకాలంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన 1,35,689 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ సాదాగా సాగిపోయిన మాట వాస్తవమే! ఎందుకంటే అందులో ఆకాశాన్నంటే హామీలు ఏవీ లేవు. ఇప్పటివరకూ ఉన్న లక్ష్యలను పూర్తిచేసేందుకే యనమల ప్రాధాన్యతను ఇచ్చారు. కేంద్రం నుంచి సాయం రాలేదన్న ‘లోటునూ’ పూడ్చేందుకు ప్రయత్నించారు. మొన్నటికి మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో పోలవరానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ తన నిరసనను వ్యక్తం చేసేసరికి కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా ‘కాదు.... కాదు.... 1,600 కోట్లు ఇవ్వనున్నాం’ అని తడబడ్డారు. కేంద్రం చేసిన పనికి ఒళ్లు మండిందో ఏమోగానీ ఏకంగా పోలవరానికి ఏకంగా 3,500 కోట్లు కేటాయించారు యనమల. రాజధాని నిర్మాణానికి కూడా ఇదే తంతు. అమరావతి నిర్మాణానికి 1,500 కోట్లు కేటాయించి రాజధానికి ఓ ఊపుని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

బడ్జెట్లో స్పష్టంగా కనిపించే మరో అంశం... సామాజికవర్గాల వారీగా కేటాయింపులు జరపడం. కాపులను బుజ్జగించేందుకు వేయికోట్లు కేటాయింపు ఎలాగూ తప్పనిసరి అని తేలిపోయింది. కానీ కాపులకు పెరుగుతున్న ప్రాధాన్యతతో కినుకు వహిస్తున్న బీసీలను ఊరడించేందుకు వారి సంక్షేమానికి ఏకంగా 8,832 కోట్లు కేటాయించారు. ఇక అందరికీ ఎంతో కొంత దక్కితే మాకేంటి అని బ్రాహ్మణులు అడుగుతారనుకున్నారో ఏమో వారికీ ఓ 65 కోట్లు కేటాయించారు. ఒకరకంగా చెప్పాలంటే కార్పొరేషన్‌ పేరునో, ఉపప్రణాళిక పేరునో దాదాపు బడ్జెట్లో 15 శాతానికి పైగా వివిధ సామాజికవర్గాలకే కేటాయించారు. ఈ తరహా కేటాయింపులు ఎక్కడికి దారితీస్తాయో విజ్ఞులకే ఎరుక. అయితే వివిధ కార్పొరేషన్లకు జరిగిన కేటాయింపులో కొంతశాతం యువకులకు అందించాలన్న నిబంధన ఒక్కటే కాస్త ఊరట కలిగించే అంశం. వేలకి వేలు కోట్లుగా జరిగిన ఈ కేటాయింపులు, అర్హులకు మాత్రమే అందేలా చూసే బాధ్యత ఏమంత తేలికైంది కాదు!

బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని భాగాలను యువతకూ, మధ్యతరగతికీ కూడా కేటాయించారు యనమల. యువత కోసం 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనీ, సొంత ఇంటి కలలు నెరవేరేందుకు గృహనిర్మాణ రంగానికి వేయి కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. కానీ ఇవి ఏ మేరకు అమలు జరుగుతాయో వచ్చే బడ్జట్‌ సమావేశాలనాటికి తేలిపోతుంది. ఇక వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ సంస్థలకీ కేటాయింపులు భారీగానే జరిగినట్లు కనిపించినా... రైతన్నలు ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి కేవలం 3,512 కోట్లు మాత్రమే కేటాయించారు. పరిశ్రమలకీ, మౌలిక వసతుల కల్పనకీ కూడా బడ్జెట్‌ తగు ప్రాధాన్యతను ఇచ్చింది.

బడ్జెట్లో పలుశాఖలకు కేటాయింపులు ఒక ఎత్తైతే వాటికి నిధులు ఎలా సమకూర్చునున్నారన్న ప్రశ్న మరో ఎత్తు! యనమల చెబుతున్న లెక్కల ప్రకారం 26,849 కోట్ల రూపాయలు కేంద్ర నుంచి గ్రాంట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రాంట్లు రావడంలో ఏమాత్రం తేడాపాడా జరిగినా ముఖ్యమైన ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక రాష్ట్రంలోంచి వచ్చే రాబడుల లక్ష్యాన్ని 52 వేల కోట్లుగా నిర్ణయించారు. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే జనాల ముక్కుపిండన్నా వసూలు చేసుకోవాలి, లేకపోతే పన్నులన్నా పెంచాలి. ఇదీ అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఆర్థికలోటుని పూడ్చేందుకు బహిరంగ మార్కెట్‌నుంచి 21 వేల కోట్ల రుణాలను తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రుణాలకి ఇది కూడా తోడైతే మున్ముందు వాటికి పన్నులు కట్టేందుకు అవస్థలు పడక తప్పదు. మరి ఈ భారీ ‘బడ్జెట్‌’తో ఒక మంచి రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న యనమల, అందుకోసం వనరులను ఎలా రాబట్టగలుగుతారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.