ఆనందయ్య మందు వచ్చేది అప్పుడేనా?
Publish Date:May 26, 2021
Advertisement
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు. ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్త భావిస్తున్నారు. సృజన లైఫ్ ల్యాబ్‌కు ప్రయోగాలకు అర్హతపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆనందయ్య మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని తెలిపారు. ప్రయోగాలకు 14 నుంచి 28 రోజులు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో.. తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని, కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనందయ్య మందును ప్రజలకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదికలు వచ్చే వరకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.
http://www.teluguone.com/news/content/anandaiah-medicine-will-come-after-ccras-report-39-116319.html





