మహీంద్రా కంపెనీకి లోకేష్ ఆహ్వానం.. రియాక్ట్ అయిన ఆనంద్ మహీంద్ర

Publish Date:Jul 19, 2025

Advertisement

 

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా  సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి' అంటూ ఆ యాడ్‌‌కు తెలుగు క్యాప్షన్ రాశారు.

 దానికి స్పందనగా రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మహీంద్రా గ్రూప్ ఏపీలో టక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ను ఆయన ఆహ్వానించారు.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామన్నారు.  

ఏపీలో పరిశ్రమ స్థాపనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, మహీంద్రా సంస్థ దీనిపై ఆలోచించాలని కోరారు.  దీనిపై నేడు ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... మున్ముందు ఏం జరగనుందో చూద్దాంఃఅని ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.