టీడీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి?

Publish Date:Aug 26, 2022

Advertisement

ఏపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లోనే కాకుండా, ఆయన మరణానంతరం ఏర్పాటైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అలాంటి రామనారాయణరెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ నుంచీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న తనను వైసీపీ అధినేత, సీఎం జగన్ పూర్గిగా పక్కన పెట్టేయడం రామనారాయణరెడ్డికి తీవ్ర అవమానంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 వాస్తవానికి  ఏపీలో వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి.  2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో ప్రత్యేకత గల కుటుంబాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఆనం కుటుంబం నుంచి రామనారాయణరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా 2004, 2009లలో వైఎస్ రాజశేఖరరెడ్డి  , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల కేబినెట్ లలో  కీలకమైన మంత్రింగా ఉన్నారు. ఒకానొక దశలో  సీఎం పదవికి రామనారాయణరెడ్డి పేరు కూడా చర్చకు వచ్చింది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డిని  జగన్ తన పార్టీలో చేర్చుకుని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, అంతకు మించి ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత ఆగ్రహంతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

. కాంగ్రెస్ పార్టీకి జగన్ గుడ్ బై చెప్పి సొంతంగా వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనపై ఘాటుగా విమర్శలు చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరు. ఆ కారణం చేతనే జగన్ ఆనంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు.  అలాగే  2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ రాజకీయాల్లో, కేబినెట్ లో కీలకంగా ఉన్న రామనారాయణరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టేయడానికీ ఇదే కారణం అయి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే తనక ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి రామనారాయణరెడ్డిలో ఉందంటారు. రామనారాయణరెడ్డి సీనియారిటీని జగన్ గుర్తించలేదని, సరైన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆనం అనుచరుల్లో కూడా ఉంది.  ఎంతో సీనియారిటీ, అనుభవం ఉన్న తనకు జగన్ తన తొలి కేబినెట్ లో స్థానం కల్పించలేదు. సరికదా మంత్రివర్గ పునర్మాణంలో కూడా పట్టించుకోకపోవడంతో రామనారాయణరెడ్డి ఇక పర్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. తొలి కేబినెట్ లోకి నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్న జగన్ మలి కేబినెట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని తీసుకోవడమే కాకుండా తనను అస్సలు పట్టించుకోకపోవడంపై ఆనం రామనారాయణ రెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు.

ఇటీవలి టీడీపీ మహానాడు సందర్భంగా రామనారాయణరెడ్డి కుమార్తె  కైవల్యారెడ్డి తన భర్తతో సహా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సమావేశం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కైవల్యారెడ్డి టీడీపీలో చేరతారని, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. ఇలా లోకేష్ తో కైవల్యారెడ్డి భేటీ అవడం వెనుక ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ మంత్రాంగం ఉందని, ముందు కుమార్తెను టీడీపీలోకి పంపించి, ఆనక ఆయన కూడా తెలుగుదేశానికే  జై కొడతారనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలోనికి వచ్చాయి.

ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ పై రామనారాయణరెడ్డి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, అధికారుల తీరుపై ఫైరయ్యారని కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరిగింది. టీడీపీలోకి వెళ్లాలనే యోచన చేస్తున్న వల్లే రామనారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామనారాయణరెడ్డి టీడీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారంటూ తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. రామనారాయణరెడ్డి మాత్రం దీనిపై ఎక్కడా స్వయంగా బయటపడకపోవడం గమనార్హం.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.