Publish Date:Jul 28, 2022
కోవిడ్ మహమ్మారి ప్రపంచదేశాల్లో యువత భవిష్యత్తును గందరగోళానికి నెట్టేసింది. కాస్తంత చదువు కుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువత భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఒక్కసారిగా ఉద్యోగం, వృత్తి దూరమయ్యే సరికి తిరిగి కాస్తంత మంచి ఉద్యోగం కోసం వెతుకులాడటంలో ఎందరో విసిగె త్తారు, జీవితం మీద విరక్తీ వచ్చేసింది. కానీ బహు తక్కువమంది తమ భవిష్యత్ మార్గాన్ని మలుపు తిప్పు కోగలిగారు. వారిలో ఆకాష్ హస్కే, ఆదిత్య కీర్తనే ఉన్నారు.
మహారాష్ట్ర ఔరంగాబాద్కి చెందిన ఈ బాల్యస్నేహితులు ఇద్దరూ ఇంజనీరింగ్ చదివి ఒక సంస్థకు పని చేస్తుండేవారు. కానీ కోవిడ్‌తో ఆ కంపెనీ చాలామందికి విశ్రాంతినిచ్చింది. వారిలో ఈ స్నేహితులూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగస్తులు సాధారణంగా మల్లీ ఉద్యోగాల వేటలో పడతారు. కానీ వీరిద్దరూ ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలో మాంసం, పౌల్ట్రీ ప్రాసెసింగ్‌లో అక్కడి వర్సిటీ ఇస్తున్న వృత్తికోర్సులో చేరారు. అది తప్పకుండా వారికి ఉపయోగపడుతుందని నమ్మా రు. కొద్దికాలం శిక్షణ అనంతరం స్వంతగా వ్యాపారం ఆరంభించాలని నిర్ణయించుకున్నారు.
అంతే వెంటనే తమ ప్రాంతంలోనే వందగజాల స్థలంలో 25 వేల రూపాయలతో చిన్నస్థాయిలో వ్యాపా రం ఆరంభించారు. వారి కంపెనీకి చిత్రంగా అపిటైట్ అనే పేరు పెట్టారు. చిత్రంగా దినదినా భివృద్ధి చెందింది. ఇపుడు నెలకు నాలుగు లక్షలు టర్నోవర్ తో నడుస్తోంది. నిజానికి ఔరంగాబద్లో మాంసం అమ్మకాలు అన్నది పూర్తిగా అసంఘటిత విభాగమని వీరి ప్రధాన వాటాదారుడు ఫాబీ సంస్థ డైరెక్టర్ ఫాహద్ అన్నారు. ఆయన వీరితో పదికోట్ల రూపాయల మేర వాణిజ్యం ఒప్పందంకూడా చేసుకు న్నారట. ఇపుడు ఔరంగా బాద్ మాత్రమేకాకుండా చిన్నపాటి పట్టణాలకీ వీరి వ్యాపారం విస్తరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/an-idea-for-life-25-140768.html
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది