ఒక్క ఐడియా.. గొప్ప ఫలితం!
Publish Date:Jul 28, 2022
Advertisement
కోవిడ్ మహమ్మారి ప్రపంచదేశాల్లో యువత భవిష్యత్తును గందరగోళానికి నెట్టేసింది. కాస్తంత చదువు కుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువత భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఒక్కసారిగా ఉద్యోగం, వృత్తి దూరమయ్యే సరికి తిరిగి కాస్తంత మంచి ఉద్యోగం కోసం వెతుకులాడటంలో ఎందరో విసిగె త్తారు, జీవితం మీద విరక్తీ వచ్చేసింది. కానీ బహు తక్కువమంది తమ భవిష్యత్ మార్గాన్ని మలుపు తిప్పు కోగలిగారు. వారిలో ఆకాష్ హస్కే, ఆదిత్య కీర్తనే ఉన్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కి చెందిన ఈ బాల్యస్నేహితులు ఇద్దరూ ఇంజనీరింగ్ చదివి ఒక సంస్థకు పని చేస్తుండేవారు. కానీ కోవిడ్‌తో ఆ కంపెనీ చాలామందికి విశ్రాంతినిచ్చింది. వారిలో ఈ స్నేహితులూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగస్తులు సాధారణంగా మల్లీ ఉద్యోగాల వేటలో పడతారు. కానీ వీరిద్దరూ ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలో మాంసం, పౌల్ట్రీ ప్రాసెసింగ్‌లో అక్కడి వర్సిటీ ఇస్తున్న వృత్తికోర్సులో చేరారు. అది తప్పకుండా వారికి ఉపయోగపడుతుందని నమ్మా రు. కొద్దికాలం శిక్షణ అనంతరం స్వంతగా వ్యాపారం ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. అంతే వెంటనే తమ ప్రాంతంలోనే వందగజాల స్థలంలో 25 వేల రూపాయలతో చిన్నస్థాయిలో వ్యాపా రం ఆరంభించారు. వారి కంపెనీకి చిత్రంగా అపిటైట్ అనే పేరు పెట్టారు. చిత్రంగా దినదినా భివృద్ధి చెందింది. ఇపుడు నెలకు నాలుగు లక్షలు టర్నోవర్ తో నడుస్తోంది. నిజానికి ఔరంగాబద్‌లో మాంసం అమ్మకాలు అన్నది పూర్తిగా అసంఘటిత విభాగమని వీరి ప్రధాన వాటాదారుడు ఫాబీ సంస్థ డైరెక్టర్ ఫాహద్ అన్నారు. ఆయన వీరితో పదికోట్ల రూపాయల మేర వాణిజ్యం ఒప్పందంకూడా చేసుకు న్నారట. ఇపుడు ఔరంగా బాద్ మాత్రమేకాకుండా చిన్నపాటి పట్టణాలకీ వీరి వ్యాపారం విస్తరించింది.
http://www.teluguone.com/news/content/an-idea-for-life-25-140768.html





