Publish Date:Oct 10, 2024
ఐఏఎస్ ఆఫీసర్‌గా తెలంగాణ కేడర్లోనే కొనసాగాలని తీవ్రంగా ప్రయత్నించిన ఆమ్రపాలి కాటాకి బిగ్ షాక్ తగిలింది. ఆమె తక్షణం ఆంధ్రా కేడర్‌కి వెళ్ళాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ పోస్టుతోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి 2010 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన ఆమ్రపాలి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశారు. మళ్ళీ తెలంగాణ కేడర్‌కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలతోపాటు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఐఏఎస్‌ల కేడర్ల విషయంలో ఖండేకర్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆమ్రపాలి భర్త ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ. ఆయన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరటరీ కేడర్లో వున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్మద్వీప్స్.లో వున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amrapali-kata-request-for-telangana-cadre-rejected-39-186634.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.