ప్రైవేటు భవనాల్లో ఈవీఎంలు.. మునిసిపల్ చట్టానికి సవరణ..దీని భావమేమి తిరుమలేశా?

Publish Date:Sep 13, 2022

Advertisement

తెలంగాణ సర్కార్ ఎన్నికలు గెలవాలంటే.. మరిన్ని అధికారాలు, వెసులు బాట్లు కావాలని భావిస్తోందా? అందుకు అవసరమైన విధంగా చట్ట సవరణలకు పాల్పడుతోందా అంటే మంగళవారం(సెప్టెంబర్13) అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లులో పొందుపరిచిన ఒక అంశాన్ని గమనిస్తే ఔననే చెప్పాలని పరిశీలకులు అంటున్నారు.

మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మునిసిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. మునిసిపల్ ఎన్నికలలో ఈవీఎంలను భద్ర పరుచడానికి అవసరమైతే ప్రైవేటు భవనాలను వినియోగానికి అవకాశం కల్పించేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఈవీఎంలను స్టోర్ చేసేందుకు, వాటికి అవసరమైన భద్రతను కల్పించేందుకు ప్రైవేటు భవనాలను వినియోగించుకునే వెసులు బాటు ఈ ఈ సవరణ ద్వారా లభిస్తుంది.

ఇప్పటికే ఈవీఎంల భద్రత, విశ్వసనీయతపై దేశ వ్యాప్తంగా అనుమానాలూ, సందేహాలూ వ్యక్తమౌతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంల స్టోరేజీ భద్రత కోసం ప్రైవేటు భవనాల వినియోగం కసం మునిసిపల్ చట్టంలో సవరణ తీసుకురావడం పలు అనుమానాలకు విమర్శలకు తావిస్తోంది.

విపక్షాలు ఈ విషయంపై పలు అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భంగపాటుతో కేసీఆర్ సర్కార్ ఇక ఎన్నికలు గెలిచేందుకు దొడ్డిదారులు వెత్తుక్కుంటోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చట్ట సవరణ మునిసిపల్ ఎన్నికలతో ఆగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పునాదులు కదులు తున్నాయన్న భయంతోనే ఈవీఎంల భద్రత విషయంలో తనకు అనూకూలంగా ఉండే విధంగా   టీఆర్ఎస్ సర్కార్ చట్టాన్ని సవరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.