జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? అమిత్ షా క్లాస్ పీకారా? 

Publish Date:Jun 11, 2021

Advertisement

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వైసీపీ నేతలు చెబుతున్నట్లు రాష్ట్రం గురించే మాట్లాడారా? జగన్ కేసుల గురించి అసలు చర్చే రాలేదా? అమిత్ షాతో జగన్ గంటన్నర సేపు సమావేశమైంది నిజమేనా? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో.. సీఎం జగన్ దాదాపు 90 నిమిషాల సేపు సమావేశమయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జగన్ , అమిత్ షా సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా, జగన్ సమావేశం.. వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా కాకుండా మరోలా సాగిందని తెలుస్తోంది. కొన్ని అంశాల్లో జగన్ కు అమిత్ షా క్లాస్ పీకారని అంటున్నారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు సీఎం జగన్. ఆయనతో పాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు 90 నిమిషాల పాటు జగన్ టీమ్.. అమిత్ షా నివాసంలోనే ఉంది. అయితే అందులో జగన్ తో అమిత్ షా మాట్లాడింది కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. 9 గంటలకు జగన్ వెళితే.. 9 గంటల 40 నిమిషాల వరకు అమిత్ షా వాళ్లకు కలవలేదట. అప్పటి వరకు జగన్ ఒక గదిలో... ఎంపీలు మరో గదిలో వెయిట్ చేశారట. తర్వాత సిగ్నల్ రావడంతో అమిత్ షాను జగన్ కలిశారట. మొదట ఇద్దరే మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ  సమస్యలకు సంబంధించి వినతి పత్రం ఇచ్చాక.. పూర్తిగా రాజకీయాల గురించే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం.

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంపైనే అమిత్ షా, జగన్ మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగిందని తెలుస్తోంది. ఎంపీ రఘురామ అరెస్టు, థర్డ్ డిగ్రీ పై జగన్ ను అమిత్ షా ప్రశ్నించారని తెలుస్తోంది. రఘురామ విషయంలో వివరణ ఇచ్చిన జగన్.. ఈ కేసులో తనకు మద్దతు ఇవ్వాలని కోరారట. కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉన్నందున రఘురామ విషయంలో సహకరించాలని విన్నవించారట జగన్. అయితే అమిత్ షా మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే స్పందించారని పక్కా సమాచారం.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారట. ఎంపీ విషయంలో అలా వ్యవహరించడమేంటని క్లాస్ తీసుకున్నారట. అంతేకాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారట. అమిత్ షా రియాక్షన్ తో జగన్ షాకయ్యారని తెలుస్తోంది. ఎంపీ రఘురామ కేసు విషయంలో జాతీయ స్థాయిలో దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో.. కేంద్రంతో కాళ్లబేరానికి వెళ్లిన జగన్ కు అమిత్ షా నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో... వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయని అంటున్నారు.

రాత్రి 10 గంటల తర్వాత ఇద్దరు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా విభజన హామీలు, పెండింగ్ సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటే 10 గంటల 15 నిమిషాలకే అమిత్ షా.. జగన్ టీమ్ దగ్గర నుంచి లోపలికి వెళ్లిపోయారని తెలుస్తోంది. అమిత్ షా వెళ్లిపోయిన తర్వాత కూడా లోపలే కాసేపు కూర్చుని 10 గంటల 30 నిమిషాలకు జగన్ .. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చారని సమాచారం. అమిత్ షా నివాసంలో జరిగింది ఇదైతే.. వైసీపీ నేతలు మాత్రం గంటన్నర సేపు జగన్ తో అమిత్ షా మాట్లాడారని, తమ పర్యటన సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. జగన్ పర్యటన మొత్తం ఆయన వ్యక్తిగత అంశాలపైనే సాగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర సమస్యలపైనే కేంద్ర మంత్రులతో చర్చిస్తే.. వాళ్ల నుంచి ఎలాంటి హామీలు వచ్చాయో ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. 

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.