గ్రీన్ కార్డ్ నిబంధనలపై వెనక్కు తగ్గిన అమెరికా

Publish Date:May 25, 2026

Advertisement

అమెరికాలో స్థిరపడాలని  ఆశపడే లక్షలాది మంది ఇండియన్ ఐటీ నిపుణులకు అమెరికా ప్రభుత్వం ఊరటనిచ్చే కబురు అందించింది. ఇటీవలి కాలంలో వీసా నిబంధనలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ప్రవాస భారతీయులలో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తీసుకువచ్చిన ఒక వివాదాస్పద ప్రతిపాదన అమెరికాలోని భారతీయ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే మెజారిటీ అభ్యర్థులు అమెరికాలో ఉంటూ కాకుండా, తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలనే నిబంధనను విధించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల హెచ్-1బీ   వీసాపై ఆధారపడి అమెరికాలో జీవిస్తున్న లక్షలాది మంది భారతీయులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అమెరికా పౌరులను వివాహం చేసుకున్న జీవితభాగస్వాములు కూడా ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కేవలం భారతీయ కంపెనీలే అమెరికా ఆర్థిక వ్యవస్థలో సుమారు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, ఐటీ నిపుణుల సేవలు అమెరికాకు అత్యంత ఆవశ్యకమని  స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, ఆందోళనల కారణంగా ట్రంప్ ప్రభుత్వం  మెట్టు దిగక తప్పలేదు. ఈ వివాదాస్పద ఆదేశాన్ని పాక్షికంగా ఉపసంహరించుకుంది. దీంతో అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.

ఈ గ్రీన్ కార్డ్ నిబంధనల మార్పులపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ..  ఈ ఆధునీకరణ ప్రక్రియ కేవలం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస విధానాన్ని క్రమబద్ధీకరించేందుకే ఈ సంస్కరణలు చేపట్టామనీ..  అయితే పరిపాలనాపరమైన మార్పుల సమయంలో కొన్ని ఇబ్బందులు  ఎదురవడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. సుమారు 20 మిలియన్ల మంది అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించిన తరుణంలో..  జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి చర్యలు తప్పడం లేదని సమర్థించారు. అయినప్పటికీ, చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ సేవలు అందిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ తాజా ఉపసంహరణ నిర్ణయం ఎనలేని ఉపశమనాన్ని ఇచ్చింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన 1,00,000 డాలర్ల భారీ హెచ్-1బీ వీసా రుసుము నుండి ఇప్పటికే అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లకు మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ నిబంధనపై కూడా అమెరికా వెనక్కి తగ్గడంతోఇండియన్ టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.