భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ అమలు ఎప్పటి నుంచంటే..?

Publish Date:Aug 26, 2025

Advertisement

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదన్న ఒకే ఒక్క కారణంతో.. అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. ఇంకొన్ని గంటల్లోనే అమల్లోకి రానున్నాయి.  దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్.. భారత్‌కు అధికారికంగా నోటీసులు పంపింది.  ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచి.. ఈ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టైమ్ దాటిన తర్వాత నుంచి.. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు  ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుత్తం అదే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.

భారత్‌పై ఇప్పటికే.. అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి..  అమల్లోకి వచ్చాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో.. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ప్రెసిడెంట్ ట్రంప్. దాంతో కలిపి.. ఇండియాపై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. టెక్స్‌టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే.. ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే.. ఈ అదనపు టారిఫ్‌లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో.. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.  మరోవైపు.. ప్రధాని మోడీ కూడా ఈ సుంకాల విషయంలో  స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో.. రాడీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెరిగినా.. భరిస్తామని స్పష్టం చేశారు.

ఈ అదనపు సుంకాల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దానిని తగ్గించేందుకు  ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి - ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు. 

సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైనా చర్చించారు. 50 శాతం సుంకాలు.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలున్నాయి. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.