పాక్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర నిల్.. ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ

Publish Date:Jun 18, 2025

Advertisement

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు. ఎలాంటి శషబిషలూ లేకుండా ట్రంప్ కు భారత్ పాకిస్థాన్ ల మధ్య ఏ విషయమైనా ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని ఇందులో మూడో దేశం ప్రమేయానికి తావేలేదని తెగేసి చెప్పేశారు.  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోన్ లో సంభాషించిన ప్రధాని భారత్, పాక్ మధ్య   జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర నిల్ అని స్పష్టం చేశారు. ట్రంప్ మోడీ ల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో మోడీ ఈ మేరకు ట్రంప్ కు స్పష్టత ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్  ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు  జరిగిన ఈ ఫోన్ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడటం, అందుకు ప్రతిగా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం తెలిసిందే. ఆ దశలో హఠాత్తుగా ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం, అందుకు తానే కారణమంటూ ట్రంప్ చెప్పుకోవడం విదితమే. అయితే అప్పట్లోనే ట్రంప్ వ్యాఖ్యలను మోడీ నిర్ద్వంద్వంగా ఖండించారు. పాక్ బతిమలాడుకోవడం వల్లే కేవలం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మోడీ అప్పుడే చెప్పారు. అయినా ట్రంప్ పదే పదే తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమీ లేదని మోడీ ఆయనే స్పష్టంగా చెప్పారు.  

ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.

By
en-us Political News

  
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.