భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌

Publish Date:Jul 25, 2025

Advertisement

హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్  మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా  పని చేస్తున్నారు సత్య నాదేళ్ల. హైదరాబాద్ లో జన్మించిన ఆయన మైక్రో సాఫ్ట్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్ గా తీర్చి దిద్దారు. ఒకప్పుడు 300 బిలియన్ డాలర్లు గల ఈ సంస్థను 3 ట్రిలియన్ డాల్లకు పైగా పెంచారు. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్శిటీ నుంచి ఎంఎస్, చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తన శక్తి సామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించి సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ని ఒక మహా వృక్షంగా విస్తరింప చేసిన పేరు సాధించారు.

గుగుల్ సీఈవోగా మోస్ట్ పాపులర్ అయిన సుందర్ పిచాయ్.. 2015 నుంచీ ఈ సంస్థ కోసం పని చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందు గుగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ కి నాయకత్వం వహించారు. ఐఐటీ ఖరగ్ పూర్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ నుంచి పట్టభద్రులైన సుందర్ పిచాయ్.. సారథ్యం వహిస్తున్న సంస్థ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ మ్యాప్స్ ని చూస్తూ వాహనాలను నడుపుతున్నాం అంటే అదంతా సుందర్ పిచాయ్ ఐడియానే.
 
ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ మిషీన్స్.. షార్ట్ ఫామ్ లో చెబితే.. ఐబీఎం కార్పొరేషన్ సీఈవో అరవింద్ కృష్ణ.. ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఈ ఐఐటీ కాన్పూర్ విద్యార్ధి సారథ్యంలో నడుస్తోన్న ఐబీఎం ప్రస్తుత టర్నోవర్ 244 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రెడ్ హ్యాట్ టర్నోవర్ 34 బిలియన్లు. ఇందుకు సారథ్యం వహించింది కూడా అరవిద్ కృష్ణే. అంతే కాదు హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ పైనా దృష్టి సారించి ఈ దిశగా కంపెనీ ముందుకు వెళ్లేందుకు నాయకత్వం వహిస్తున్నారు అరవింద్ కృష్ణ.
 
అడోబ్ సీఈవో శంతను నారాయణ్. 2007 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 2024 నాటికి 250 బిలియన్ డాలర్లు. హైదరాబాద్ లో జన్మించిన నారాయణ్ అడోబ్ ని సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోడ్ లోకి మార్చారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలిచిందంటే ఇదంతా శంతను ఆలోచనల వల్ల మాత్రమే సాధ్యమైందని అంటారు. ఉస్మానియా, బౌలింగ్ గ్రీన్ స్టేట్, బర్కిలీ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందిన ఈయన తన సంస్థ  అంచెలంచలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.
 
మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మల్హోత్రా.. 2017 నుంచి సంజయ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నారు.  ఈ సంస్థ ఆదాయం 21 బిలియన్ డాలర్లు. బిట్సి పిలానీ, యూసీ బర్కిలీ గ్రాడ్యుయేట్. శాన డిస్క్ సహస్థాపకులైన సంజయ్.. సెమికండక్టర్ మెమరీలో మైక్రాన్ ని ముందుండి నడిపిస్తున్నారు.
 
పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. 2018 నుంచి ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా ఉంది.  ఐఐటీ వారణాశి, బోస్టన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అరోరా.. గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ లో సీనియర్ పొజిషన్లో వర్క్ చేశారు. పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోని మరింత బలోపేతం చేశారు. 

ప్రస్తుతం ఆల్ఫాబెట్ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 2023 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. సుమారు 182 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఈ సంస్థకు నీల్ మోహన్ సారథ్యం ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గానూ పని చేశారీ ఇండో అమెరికన్. ఈ ప్లాట్ ఫామ్ ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు నాయకత్వ బాధ్యతలను అప్పగించిందీ సంస్థ.

వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల్ రామణి 2020 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బయో టెక్నాలజీ సంస్థ 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.  ముంబైలో జన్మించిన రేష్మా బోస్టన్ లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీస్కున్నారు. జన్యు, కణ చికిత్సలను డెవలప్ చేస్తున్న యూఎస్ బేస్డ్ బయోటెక్ సంస్థకు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా రికార్డు సృష్టించారు రేష్మా కేవల్.

ఇక కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్.. 2023 నుంచి ఈ సంస్థ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల ఆదాయం గల ఈ సంస్థను ఇండో- అమెరికన్ అయిన రవి పరుగులు పెట్టిస్తున్నారు. ట్రాన్స్ యూనియన్ లో ఇండివిడ్యువల్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు.

అరిస్టా నెట్ వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్  2008 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 90 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ సంస్థకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు జయశ్రీ. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ అమెరికన్ కావడం విశేషం. అరిస్టాను క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలుపుతున్నారీమె.

వేఫర్ సీఈఓ నీరాజ్ షా.. 2002లో స్థాపించిన ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులు కూడా. ఈ కామర్స్ లో ఫర్నిచర్, గృహోపకరణాల్లో 12 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ సంస్థ సొంతం. ఇండో అమెరికన్ అయిన షా, వేఫర్ ను గృహోపకరణాల విభాగంలో ప్రముఖ ఆన్ లైన్ రీటైలర్ గా నిర్మించారు.

ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం 2022 నుంచి ఈ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్ లో ఈ సంస్థ 90 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన రాజ్ ఫెడ్ ఎక్స్- ప్రపంచ వ్యాప్త విస్తరణపై తనదైన ముద్ర వేశారు.

గోడాడీ సీఈఓ అమన్ భూటానీ 2019 నుంచి ఈ సంస్థ సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, లాంకాస్టర్ వర్శిటీ నుంచి డిగ్రీలను పొందిన భూటాని వెబ్ హోస్టింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ లో గోడాడి విస్తరణకు నాయకత్వం వహిస్తున్నారు. అమన్ నాయకత్వంలోని ఈ సంస్థ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. 
 
వీళ్లే కాక ఇక మీ స్సేస్, సాఫ్ట్ వేర్, మెడిక‌ల్, లా, త‌దిత‌ర రంగాల్లో గ‌ల భార‌తీయుల ప్ర‌తిభిపాట‌వాల విలువ అమెరికాకు ల‌క్ష  కోట్ల మేర ఉంటుంది. అంతేనా భార‌తీయులు అమెరికాకు ప‌న్ను క‌ట్టే వారి ప‌ర్సంటేజీలో 1. 5 శాతం వ‌ర‌కూ ఉన్నారు. ఇక్క‌డున్న కుల‌-మ‌త‌-వ‌ర్గ- వైష‌మ్యాల‌నే బాధ‌లు ప‌డ‌లేక అక్క‌డికి వ‌ల‌స వ‌చ్చిన మావాళ్లు.. మీ దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. వాళ్లే లేకుంటే మీ సంస్థ‌ల‌ ఆర్ధిక ప‌టుత్వం  నేల చూపులు చూసే అవ‌కాశ‌ముంది. ఐడియా ఎవ‌రైనా ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయ‌డంలోనే ఉంటుంది అస‌లు స‌త్తా. ఆ స‌త్తాగ‌ల భార‌తీయులు లేకుంటే మీ గ‌తి అధోగ‌ తే అన్న‌ది ప‌లువురు అంత‌ర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటోన్న మాట‌.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.