యు.ఎస్‌లో తుపాకీ సంస్కృతిపై సెనెట్ ఆమోదానికి సుప్రీం అడ్డు!
Publish Date:Jun 24, 2022
Advertisement
ఒకే చెట్టుకి రెండు కాయలు వుండవచ్చు. ఒకే లాంటి వారు ఇద్దరు వుంటారు. ఒకే సమస్యకు రెండు విరుద్ధ తీర్పులు వుండకూడదు. అమెరికాలో ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం అక్కడి తుపాకీ సంస్కృతి మీద రెండు విరుద్ద తీర్పులు ఒకే రోజు వినడం! గన్ కల్చర్ ని నిలువరించేందుకు సెనేట్‌లో బిల్లుకి అందరి ఆమోదం లభించడం. మరో వంక సుప్రీంకోర్టు అసలు అమెరికన్లు తుపాకీ కలిగి వుండటంలో తప్పులేదు, అది వారి హక్కు అంటూ తీర్పునీయడం! హమ్మయ్య పీడ విరగడవుతుందను కున్నది, అబ్బేం నాకు మరణం లేదని దెయ్యమే ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది ఒక జానపద కథలో! ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రజలు నవ్వాలో, ఏడవాలో అర్ధంగాని సందిగ్ధతలో వున్నారు. సెనెట్ ఆమోదానికి సుప్రీంకోర్టు వెంటనే ఆదేశాలతో అడ్డుకోవడం ప్రజలు సందిగ్ధానికి గురయ్యారు. అసలు దశాబ్దాలుగా అమెరికాలో ప్రతీ రాష్ట్రంలోనూ ఎవరయినా తుపాకీ లేదా పిస్టల్‌ను పట్టి యదేచ్ఛగా తిరగడం కోపంవస్తే ఎదుటివారిని కాల్చేయడం విన్నాం, వింటున్నాం. ఈ విష సంస్కృతిని తొలగించా లని చాలాకాలం నుంచి అక్కడ నినాదాలు చేస్తుండటం కూడా వింటున్నాం. దీన్ని గురించి అక్కడి సెనెట్‌లో చర్చకు వచ్చిన ప్రతీసారి అది వీగిపోతూనే వుంది. అయితే ఇటీవల ఒక బడిలో జరిగిన దారుణ కాండ అక్కడి ప్రజల్ని మరింత భయపెట్టింది. ఫలితంగా అక్కడి సెనేట్‌లో గన్‌కల్చర్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలన్న గట్టి పట్టుదలతో తుపాకీ హింస నిరోధక బిల్లును ఎట్టకేలకు యు.ఎస్ సెనేట్‌లో అంగీ కరిం చారు. ఇక అది చట్టరూపంలోకి మారి అమలు జరగడమే ఆలస్యం అని ఆనందించారు. ఈ బిల్లు ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమిత మైనా ఇటివల న్యూయా ర్క్, టెక్సాస్‌లలో గన్‌కల్చర్ సృష్టించిన రక్త పాతాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల్లో చలనం కలిగించా యి. దీంతో నెలక్రితం కూడా ఊహాజని తంగానే ఉన్న గన్‌కల్చర్ బిల్లు అనూహ్యంగా యూఎస్ కాంగ్రెస్ ముందుకొచ్చింది. చిత్రమేమంటే గురు వారం అక్కడి సుప్రీంకోర్టు ఇందుకు పూర్తి విరుద్ధమైన తీర్పునిచ్చింది. అసలు అమెరికావాసులకు తుపా కులు కలిగి వుండటానికి స్వేచ్ఛ, హక్కు వుందని! 6-3 తేడాతో వెలువడిన నిర్ణయం శతాబ్దానికి పైగా పాత న్యూయార్క్ చట్టాన్ని కొట్టివేస్తుంది, ఇది ఒక వ్యక్తికి చట్టబద్ధ మైన స్వీయ-రక్షణ అవసరం లేదా సరైన కారణం ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం ఉంది, ఇది ఇంటి బయట చేతి తుపాకీని తీసుకెళ్లడానికి అనుమతిని పొందుతుంది. కాలిఫోర్ని యాతో సహా అనేక ఇతర రాష్ట్రాలు ఒకే విధమైన చట్టాలను కలిగి ఉన్నాయి . కోర్టు తీర్పు ప్రజలను బహి రంగంగా తుపాకులు కలిగి ఉండకుండా నిరోధించే వారి సామర్థ్యాన్ని అరికడుతుంది. డెమొక్రాటిక్ ప్రెసి డెంట్ జో బిడెన్ ఈ నిర్ణయాన్ని ఖండించారు, ఇది ఇంగితజ్ఞానం, రాజ్యాంగం రెండింటికీ విరుద్ధంగా ఉంది. అలాగే మనందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టాలి అని అన్నారు. మన తోటి అమెరికన్ల ను రక్షించ డానికి సమాజపరంగా ఏ విధంగా రక్షణ చర్యలు చేయాలన్నది ఆలోచించాలన్నారు. తుపాకీ భద్రతపై తమ గళాన్ని వినిపించాలని దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు. వీధులు, పాఠశాలలు, చర్చిలలో కాల్పులకు గురికాకుండా మన పౌరులను రక్షించడానికి రాడికల్ సైద్ధాంతిక ఎజెండాను ముందుకు తీసుకురావడానికి, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించే కోర్టు నుండి ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం రావడం హర్షణీయం కాదని కాలిఫోర్నియా నాయకుడు గావిన్ న్యూ సోమ్ ట్వీట్ చేశారు. జస్టిస్ క్లారెన్స్ థామస్ మెజారిటీ అభిప్రాయాన్ని పేర్కొన్నారు. తొమ్మిది మంది సభ్యుల కోర్టులో ఇతర ఐదుగురు సంప్రదాయవాదులు చేరారు, వీరిలో ముగ్గురిని మాజీ రిపబ్లికన్ అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఈ బిల్లు కింద 13 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. ఈ నిధులను స్కూళ్ల వద్ద భద్రత పెంపు, మానసిక ఆరోగ్యం, హింస నిరోధక కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. కాగా ఎన్నికల ఏడాది డెమొక్రాటిక్ పార్టీ చేసిన వాగ్ధానాలకు ఈ బిల్లు దూరంగా ఉంది. దాడులకు ఉపయోగించే ఆయుధాలపై నిషేధం, అధిక సామర్థ్య మున్న అమ్మోనియం మ్యాగజిన్స్ వినియోగంపై కూడా నిషేధాన్ని అమలు చేయాలని డెమొక్రాటిక్ పార్టీ నేతలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం వెలువడిన విరుద్ద ప్రకటనల పట్ల అమెరికా సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఆయుధాల విక్రయంపై ఆంక్షల విధింపునకు డెమొక్రాట్ల ఇంతకాలం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్ పార్టీ అడ్డుపడుతూ వచ్చింది. కానీ న్యూయార్క్, టెక్సాస్ కాల్పుల రక్తపాతాలు రిపబ్లికన్ నాయకుల్లోనూ కదలికలు రావడంతో బిల్లు కార్యరూపం దాల్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతిని నిలువరించేందుకు పటిష్ఠమైన చట్టం అవసరమని ఇరు పార్టీలకు చెందిన సెనేటర్లు భావించారు. ఈ బిల్లు కార్యరూపం దాల్చితే గన్ కొనుగోలు చేసే యువకుల పూర్వపరాలను తనిఖీ చేస్తారు. అంతే కాకుం డా నేరచరిత్ర లేదా మానసిక స్థితి సరిగా లేని వారి నుంచి ఆయుధాలను దూరం చేస్తారు.
http://www.teluguone.com/news/content/america-25-138347.html





